MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో నిప్పుల కుంపటి.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

ఏపీలో నిప్పుల కుంపటి.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Heatwave Alert : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం 101 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతోందనీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 15 2026, 11:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాబోయ్ ఎండలు.. మాడిపోతారు !
Image Credit : our own

బాబోయ్ ఎండలు.. మాడిపోతారు !

ఆంధ్రప్రదేశ్ లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 275 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఎండలతో పాటు ఉక్కపోత కూడా తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త
Image Credit : Getty

ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త

గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

35
తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు ఇవే
Image Credit : our own

తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు ఇవే

గురువారం మొత్తం 34 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, హిరమండలం, పాతపట్నం మండలాల్లో ఎండలు మండిపోనున్నాయి. అలాగే విజయనగరం జిల్లాలో బొబ్బిలి, రాజాం సహా 16 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు 14 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 37 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

45
రికార్డు స్థాయికి పెరిగిన ఉష్ణోగ్రతలు
Image Credit : Freepik

రికార్డు స్థాయికి పెరిగిన ఉష్ణోగ్రతలు

బుధవారం నమోదైన వివరాల ప్రకారం, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డిగ్రీలు, కడపలో 44.1 డిగ్రీలు, మార్కాపురం అనుమలపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్రలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కర్నూలు, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 41 డిగ్రీల వేడి నమోదైంది.

55
మండిపోతున్న ఎండలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Image Credit : PTI

మండిపోతున్న ఎండలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఏదైనా కప్పుకోవాలని సూచించారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, షుగర్, బీపీ ఉన్న రోగులు ఎండలో తిరగడం ప్రమాదకరం అని హెచ్చరించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉక్కపోత, వడగాల్పుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా మారిందా? ఈ 5 చిట్కాలతో సూపర్ ఫాస్ట్‌గా మార్చుకోండి!
Recommended image2
Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved