- Home
- Andhra Pradesh
- AP Excise Suraksha : మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే చాలు.. హ్యాపీగా మందు పార్టీ చేసుకోవచ్చు
AP Excise Suraksha : మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే చాలు.. హ్యాపీగా మందు పార్టీ చేసుకోవచ్చు
AP Excise Suraksha .. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా లాంచ్ చేసిన ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే చాలు నకిలీ మద్యం మీ ధరిచేరదు. ఈ యాప్ ఏది? దీన్ని ఎలా ఉపయోగించాలి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇకపై కల్తీ మద్యాన్ని ఇట్టే గుర్తించవచ్చు..
AP Excise Suraksha : మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది తెలిసి కూడా ప్రభుత్వాలే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తాయి... ప్రజలు ఎగబడిమరీ కొనుక్కుని తాగుతారు. మందు ఇచ్చే కిక్కులో మజా ఉంటుందని మందుబాబులు చెబుతుంటారు… అందుకే ఆరోగ్యాన్ని పనంగా పెట్టిమరీ తాగుతుంటారు. కానీ ఈ కిక్కు ఒక్కోసారి లెక్క తప్పవచ్చు... ఇందుకు ప్రధాన కారణం నకిలీ మద్యం. సాధారణ మద్యమే ప్రమాదకరం అనుకుంటే ఈ నకిలీ మద్యం ఏకంగా విషం లాంటిదే... ఆరోగ్యాన్ని మరింత తొందరగా నాశనం చేస్తుంది. ఇలాంటి నకిలీ మద్యం ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా పట్టుబడటం ఇటీవల కలకలం రేపింది.
రాష్ట్రంలోని ములకచెరువు, ఇబ్రహీంపట్నంలలో ఏకంగా వైన్స్ లలో నకిలీ మద్యం అమ్ముతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నకిలీ మద్యం తయారుచేసిన ముఠాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది... కానీ ప్రజల్లో ఇంకా ఆ భయం పోవడంలేదు. అందుకే చంద్రబాబు సర్కార్ నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రజల చేతికే ఓ ఆయుధం ఇచ్చింది. అదే 'ఏపీ ఎక్సైజ్ సురక్ష' యాప్. ఇది ఫోన్ లో ఉంటే చాలు నకిలీ మద్యం మీ ధరిచేరదు... హ్యాపీగా నాణ్యమైన మద్యం తాగవచ్చు.
ఏమిటీ ఏపీ సురక్ష యాప్?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఇటీవల నకిలీ మద్యం వ్యవహారం బైటపడింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. నకిలీ మద్యం వ్యవహారంపై సిట్ ఏర్పాటుచేసి విచారణ చేయిస్తోంది... ఇప్పటికే పలువురు నిందితులను పట్టుకుని జైల్లో పెట్టింది. ఇంతటితో ఆగకుండా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగించింది ప్రభుత్వం… ఇలా తీసుకువచ్చిన ప్రత్యేక యాప్ ఈ ''ఏపీ ఎక్సైజ్ సురక్ష'.
నకిలీ మద్యాన్ని ఈజీగా గుర్తించేందుకు ఈ సురక్ష యాప్ ను తీసుకువచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ. అంటే ఇటీవల జరిగినట్లు నకిలీ మద్య వైన్స్ లకు చేరినా కొనుగోలుచేసిన ప్రజలు దాన్ని గుర్తించవచ్చు. ఇలా నకిలీ మందు బారినపడి ఆరోగ్యాన్ని మరింత నాశనం చేసుకోకుండా ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సురక్ష యాప్ మద్యంసేవించే అలవాటున్న ప్రతిఒక్కరి సెల్ ఫోన్ లో ఉండాల్సిన అవసరం ఉంది.
ఏపి ఎక్సైజ్ సురక్ష యాప్ ఎలా ఉపయోగించాలి?
ఏపీ ప్రభుత్వం నకిలీ మద్యంపై యుద్దంకోసం రూపొందించిన ఈ సురక్ష యాప్ ను స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ యాప్ ను ఉపయోగించి వైన్స్ తో పాటు ప్రభుత్వ అనుమతితో మద్యం విక్రయాలు చేపట్టేవారే కాదు వినియోగదారులు కూడా ఇట్టే నకిలీ మద్యాన్ని గుర్తించవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. మద్యం సీసాపై ప్రభుత్వ హోలోగ్రామ్ ను ఈ యాప్ ను ఉపయోగించి స్కాన్ చేయవచ్చు... దీంతో ఇది ఎక్కడ, ఎప్పుడు తయారయ్యింది వటి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇలా మద్యం తయారీ తేదీ, టైమ్, బ్యాచ్ నెంబరు వంటి అన్ని వివరాలు హోలోగ్రామ్ స్కాన్ చేయగానే తెలిసిపోతాయి.
నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వినియోగించుకుంటున్నాం.. అందుకే 'ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్'ను తెచ్చాం.
బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి. రిటైల్ షాపుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాతే మద్యం అమ్మాలనే విధానాన్ని తెస్తున్నాం. అలాగే వినియోగదారులు… pic.twitter.com/XsuVcZpcAT— Telugu Desam Party (@JaiTDP) October 12, 2025
నకిలీ మద్యం గుర్తిస్తే ఈ నంబర్లకు కాల్ చేయండి..
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను వైన్స్ నిర్వహకులు తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మద్యం బాటిల్ వినియోగదారుడికి అందించేముందు దానిపై ఉండే హోలోగ్రామ్ స్కాన్ చేయాలి... అనుమానం ఉంటే దాన్ని పక్కనబెట్టి మరో బాటిల్ ఇవ్వాలి... నకిలీ మద్యంగా గుర్తిస్తే వెంటనే 14405 నెంబర్ కి లేదంటే స్థానిక ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచించారు. వినియోగదారుడు కూడా మద్యం కొనుగోలు చేయగానే ఓసారి సురక్ష యాప్ ను ఉపయోగించి చెక్ చేసుకోవాలని... నకిలీ మద్యం అయితే వెంటనే పైన పేర్కొన్న నంబర్ కి ఫోన్ చేయాలని సూచిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు.
సురక్ష యాప్ ద్వారా బెల్ట్ షాప్ లకు చెక్
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా కేవలం నకిలీ మద్యం మహమ్మారిని అరికట్టడమే కాదు బెల్ట్ షాప్ లను కట్టడిచేసే చర్యలు తీసుకుంది ఏపీ ఎక్సైజ్ శాఖ. వైన్స్ తో పాటు మద్యం బాటిల్స్ కు జియో ట్యాగింగ్ జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.. అంటే ఇది వైన్స్ లో కాకుండా మరెక్కడయినా స్కాన్ అయితే వెంటనే గుర్తించవచ్చన్నమాట. బెల్ట్ షాప్ లో మద్యం అమ్మకాలు చేపట్టడం చట్టరిత్యా నేరం... పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బెల్ట్ షాపులనేవి లేకుండా ఉండేందుకు కూడా 'ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్' ఉపయోగపడుతుంది.
మద్యం బాటిళ్లు, మద్యం షాపులకు జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ పెడుతున్నాం. బెల్టు షాపులు పెట్టి అమ్మితే బెల్టు తీస్తా..#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/kFMw0IW0JG— Telugu Desam Party (@JaiTDP) October 12, 2025