- Home
- Andhra Pradesh
- Fake Liquor : వైసిపి చేతికి బ్రహ్మాస్త్రం అందించిన టిడిపి నాయకులు.. చంద్రబాబు ఏం చేశారో తెలుసా?
Fake Liquor : వైసిపి చేతికి బ్రహ్మాస్త్రం అందించిన టిడిపి నాయకులు.. చంద్రబాబు ఏం చేశారో తెలుసా?
Fake Liquor : నకిలీ మద్యం వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇందులో టిడిపి నాయకులకు ప్రమేయం ఉందని ఆరోపణలు రావడం.. సీఎం చంద్రబాబు దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంలో డెరెక్ట్ గా సీఎం యాక్షన్ లోకి దిగారు.

ఇద్దరు టిడిపి నాయకులు సస్పెండ్
Fake Liquor : ఆంధ్ర ప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకల చెరువులో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది... స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ కల్తీ మద్యం వ్యవహారంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులు దాసరిపల్లి జయచంద్రరెడ్డి, సురేంద్ర నాయుడును పార్టీ నుండి సస్పెండ్ చేశారు... ఈ మేరకు ఏపీ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఏమిటీ నకిలీ మద్యం కేసు?
ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఇటీవల పోలీసులు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలా పట్టుబడింది కల్తీ మద్యంగా గుర్తించారు... దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మద్యం తరలిస్తూ పట్టుబడినవారిని విచారించి తీగలాగితే డొంక కదిలింది. ఈ నకిలీ మద్యం కేసులో వైన్స్, బార్ యజమానులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని తేలింది.
కాసులకోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఈ నకిలీ మద్యం దందాను సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రదారి అద్దేపల్లి జనార్ధనరావుగా గుర్తించారు. విజయవాడలో అతడికి ఓ బార్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇలా మద్యం వ్యాపారంలో ఉన్న అతడు తమిళనాడు, ఒడిషాకు చెందినవారి సాయంతో ములకచెరువులో నకిలీ మద్యం తయారీ చేపట్టాడు. నకిలీ లేబుల్స్ తో పలు బ్రాండ్స్ పేరిట కల్తీ మద్యం తయారుచేసి ములకల చెరువు రాక్ స్టార్ వైన్స్, పెద్దతిప్పసముద్రం ఆంధ్రా వైన్స్ లో విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడిన వాహనం ములకచెరువు రాక్ స్టార్ వైన్స్ యజమాని రాజేశ్ దిగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ప్రధాన నిందితుడు జనార్ధనరావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నకిలీ మద్యం వ్యవహారంతో ప్రమేయమున్న వైన్స్ లను సీజ్ చేశారు.. అలాగే ఇద్దరు టిడిపి నాయకులను సస్పెండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంపై వైసిపి విమర్శలు
గత ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది... ఈ వ్యవహారంలో వైసిపి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఇలా లిక్కర్ స్కాం వివాదం కొనసాగుతున్న సమయంలో నకిలీ మద్యం వ్యవహారం వైసిపి చేతికి అస్త్రంగా మారింది.
గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ ప్రజలను తప్పుదారి పట్టించి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ వైసిపి ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ప్రభుత్వమే ఇప్పుడు కల్తీ మద్యం మాఫియాను తయారుచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ మాఫియానే వైన్స్, బార్లలో కల్తీ మద్యం సరఫరా చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యంతో పట్టుబడిన సురేంద్రనాయుడు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని... దీన్నిబట్టే టిడిపి నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపిస్తున్నారు వైసిపి నాయకులు.
నకిలీ మద్యం వ్యవహారంపై సీఎం సీరియస్
ప్రత్యర్థి వైసిపికి అస్త్రంగా మారిన కల్తీ మద్యం వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో కేవలం ఈ కల్తీ మద్యం వ్యవహారంపైనే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ములకల చెరువు కల్తీ మద్యం రాకెట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం ఇందులో ఎంత పెద్దవారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టకూడదని ఆదేశించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులను వెంటనే సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు ప్రకటన చేశారు.
కల్తీ మద్యంపై ఉక్కుపాదం
నకిలీ మద్యం వ్యవహారం ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉండటంతో దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను ప్రజలముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని వెనకున్న ఆర్థిక లావాదేవీలు, సరఫరా నెట్ వర్క్ గురించి ప్రజలందరికీ తెలియాలని... నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు. ఇకపై రాష్ట్రంలో కల్తీ మద్యం అనే మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖను ఆదేశించారు.