జగన్ కు కొత్త తలనొప్పి: గంటాపై పోరుకు తెర తీసిన అవంతి

First Published 5, Aug 2020, 2:39 PM

అంతర్గత సమస్యలే వైసీపీకి ప్రధాన సమస్యలుగా తయారవుతున్నాయి. మొన్న రఘురామకృష్ణం రాజు వ్యవహారమే చిలికి చిలికి గాలివానగా మారితే.... ఇప్పుడు కొత్తగా అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఆ దిశగానే పార్టీకి నష్టం కలిగించేలా కనబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం బాగా బలహీనపడి, క్యాడర్ లో నైరాశ్యం ఆవరించినా.... రాజకీయాలు మాత్రం హాట్ హాట్ గానే ఉన్నాయి. అధికారపక్షంలోనే జరుగుతున్న ఆధిపత్య పోరు, అంతర్గత వ్యవహారాలు రాజకీయంగా వాతావరణాన్ని వేడెక్కిస్తుంది.

అమరావతి వంటి రాజకీయ నిర్ణయాల పట్ల ప్రతిపక్షం ఆరోపణలు చేసిన, అలుపెరుగని పోరాటం చేసినా...  అధికార వైసీపీ దూసుకుపోయింది, దూసుకుపోతుంది కూడా.  కానీ అంతర్గత సమస్యలే వైసీపీకి ప్రధాన సమస్యలుగా తయారవుతున్నాయి. మొన్న రఘురామకృష్ణం రాజు వ్యవహారమే చిలికి చిలికి గాలివానగా మారితే.... ఇప్పుడు కొత్తగా అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఆ దిశగానే పార్టీకి నష్టం కలిగించేలా కనబడుతున్నాయి.

గంటా శ్రీనివాసరావు సైకిల్ దిగి వైసీపీ ఖండువా  వచ్చాయి. ఈనెల 16వ తేదీన ముహూర్తం ఫిక్స్ అని అంటున్నారు. అధికారికంగా ప్రకటన రాకున్నప్పటికీ... ఇది మాత్రం ఖచ్చితంగా జరిగేదిలాగే కనబడుతుంది. విశాఖకు చెందిన బలమైన నాయకుడు గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీలో గంటా చేరికతో పవర్ ఈక్వేషన్స్ లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి.

దీనితో అలెర్ట్ అయిన విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జి  రెడ్డివంటివారు సైకిళ్ళ కుంభకోణంలో గంటా ఆయన అనుచరులు ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ తరువాత కరోనా తో విజయసాయి రెడ్డి ఆసుపత్రిలో చేరడంతో సజ్జల ద్వారా వైసీపీలో చేరడానికి గంటా మార్గం సుగమం చేసుకున్నారు.

ఆయన వైసీపీలో చేరనున్న విషయం ఇప్పుడు తేలిపోవడంతో అవంతి మరోసారి తన నోటికి పని చెప్పారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.

అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారన్నారని ఆయన ఆరోపించారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని, తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోనేందుకు దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఇక ఇప్పుడు ఈ విషయాలను మనం పరిశీలిస్తే.... గంటా శ్రీనివాసరావు ఒక అవినీతి పరుడు అనే విషయాన్నీ నిరూపించేందుకు అవంతి శ్రీనివాస్ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. ఈ వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే... అవినీతి పరులు వైసీపీ అనే పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇక్కడ అవంతి ఒప్పుకుంటున్నట్టే కదా!

వైసీపీ అనే గంగలో మునిగినవారంతా అగ్ని పునీతులు, బయట ఉన్నవారంతా అవినీతిపరులు. అవినీతి చేసినవారికి వైసీపీలో చేరితే శిక్షలు ఉండవు. ఇది ఒకరకంగా అవంతి శ్రీనివాస్ చెబుతున్న మాటలకు అర్థం.

దీనివల్ల పార్టీగా వైసీపీకి తీవ్ర నష్టం. అవినీతిపరులతో కూరుకుపోయింది ఈ పార్టీ అని రేపు టీడీపీ వారు గంటా చేరితే ఆరోపణలు చేయరని గ్యారంటీ ఏమిటి..? అప్పుడు టీడీపీ వారు ఆ ప్రశ్న లేవనెత్తుతే అవంతి శ్రీనివాస్ కానీ వైసీపీ కానీ సమాధానం ఎలా చెబుతారనేది ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న.

ఇప్పటికే వైసీపీ పై టీడీపీ, బీజేపీ వంటి ప్రతిపక్షాలు అవినీతి పార్టీ అంటూ, విజయసాయి రెడ్డి ని ఏ2 అంటూ రకరకాలుగా సంబోధిస్తుంటారు.ఇప్పుడు గంటా గనుక చేరితే, గంటా చేరడమే ఇందుకు ప్రాత్యక్ష ఉదాహరణ అని అనరని గ్యారంటీ ఏమిటి..? అంటే వైసీపీ వారు ఏమని సమర్థించుకుంటారో చూడాలి.

ఈ వ్యాఖ్యల్లోని గూడార్థాలను వెదకడం పక్కకుంచినా ఇది పార్టీలోని అంతర్గత విబేధాలను మాత్రం తెరమీదకు తీసుకొస్తుందనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. మొన్న గన్నవరం విషయంలో దుట్టా వంశీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసారో మనం చూసాము. తాజాగా అవంతి శ్రీనివాస్ వంతు వచ్చినట్లయింది.

వైసీపీలోకి కొత్తవారు ఎంట్రీ ఇస్తున్న కొద్దీ... విభేదాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ నుంచి వచ్చినవారు వెర్సస్ అక్కడ ఉన్నవారుగా పరిస్థితులు మారిపోతున్నాయి. మరింతమంది టీడీపీ వారు వైసీపీలో చేరితే ఎక్కువయిపోయిన బడా నేతల వల్ల మరింతగా పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపే ఆస్కారం లేకపోలేదు.

loader