MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...

AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలయ్యింది. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైన ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో టిడిపి వరుసగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తోంది.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 17 2026, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టిడిపి అభ్యర్థుల జాబితా విడుదల...
Image Credit : X/Telugu Desam Party

టిడిపి అభ్యర్థుల జాబితా విడుదల...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన పార్టీ.. తాజాగా రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో మచిలీపట్నం మేయర్ అభ్యర్థితో పాటు పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

అక్టోబర్ 16, శుక్రవారం రాత్రి 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ.. తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. దీంతో వివిధ పట్టణ ప్రాంతాల్లో పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు వెల్లడవుతున్నాయి. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవడంతో పాటు పట్టణ స్థానిక సంస్థల్లో తమ బలాన్ని పెంచుకోవడంపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మచిలీపట్నం మేయర్ అభ్యర్థి ఎవరు?
Image Credit : X/AndhraPradeshCM

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి ఎవరు?

టీడీపీ తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్లా పేరును ఖరారు చేసింది. దీంతో పాటు వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రెండో జాబితాలోని అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

1. ఆకివీడు - నిలోఫర్ షేక్

2. బేతంచెర్ల - లోకేష్ గౌడ్

3. బుచ్చిరెడ్డిపాలెం - దొడ్ల విజయలక్ష్మీ

4. చీరాల - స్పందన

5. డోన్ - కోట్ల సుజాతమ్మ

6. గుత్తి - గోవిందరాజులు

7. గుంతకల్లు - యశోద

8. జంగారెడ్డిగూడెం - రొంగల అనూష

9. నందికొట్కూరు - సుబురున్నిసా

10. ఎమ్మిగనూరు - మాచాని సునీత

11. ఏలేశ్వరం - యార్లగడ్డ అక్షిత

12. ఉయ్యూరు - చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్

13. వెంకటగిరి - దొంతు శారద

14. ప్రొద్దుటూరు - నంద్యాల రాఘవరెడ్డి

15. నర్సీపట్నం - చింతకాయల పద్మావతి

16. నందిగామ - శాకమూరి వంశీధర్

17. నాయుడుపేట - షకీరా

18. కొవ్వూరు - జొన్నలగడ్డ రాధారాణి

19. కొండపల్లి - కన్నెకంటి అమూల్య

20. కళ్యాణదుర్గం - బుట్న లక్ష్మి

21. కదిరి - షేక్ సమీరా

34
తొలి జాబితాలో ఏడుగురు మేయర్ అభ్యర్థులు
Image Credit : Chandrababu Twitter

తొలి జాబితాలో ఏడుగురు మేయర్ అభ్యర్థులు

టీడీపీ అక్టోబర్ 16 (శుక్రవారం) రాత్రి విడుదల చేసిన తొలి జాబితాలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. వీరితో పాటు 26 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు చైర్‌పర్సన్ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మొత్తం 36 మందికి ఈ జాబితాలో చోటు కల్పించింది.

తొలి జాబితాలో మేయర్ అభ్యర్థులు వీరే

1. చిత్తూరు – కటారి హేమలత

2. కడప – డాక్టర్ నెల్లటూరి సువర్ణ

3. కర్నూలు – విజయ ప్రత్యూష

4. నెల్లూరు – పోలబోయిన రూప్ కుమార్

5. తిరుపతి – మన్యం శ్రీనివాస ప్రసాద్

6. విశాఖపట్నం – డాక్టర్ ముక్కా శ్రావణి

7. విజయనగరం – అవనపు భార్గవి

ఈ జాబితాలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అభ్యర్థుల ఎంపిక సాగినట్లు తొలి జాబితాను పరిశీలిస్తే తెలుస్తోందంటున్నారు.

తొలి జాబితాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభ్యర్థులు

1. ఆళ్లగడ్డ – అనీషా షేక్

2. అద్దంకి – కాకాని అశోక్

3. ఆదోని – నాగమణి

4. ఆత్మకూరు (నంద్యాల) – డాక్టర్ గోవిందరాజులు

5. బద్వేల్ – సోమశిల దివ్య తేజ

6. బొబ్బిలి – రేణుకా దేవి స్వప్న

7. దాచేపల్లి – తంగెళ్ల శ్రీనివాసరావు

8. ధర్మవరం – పరిశె సుధాకర్

9. గురజాల – నేలవల్లి బొల్లయ్య

10. హిందూపురం – పి.ఎస్. మంజునాథ్

11. ఇచ్చాపురం – ఆసి లీలా రాణి

12. జగ్గయ్యపేట – నరేంద్రుల వినీత

13. జమ్మలమడుగు – జ్యోతి చాడిపిర్ల

14. కమలాపురం – గొంగిలిరెడ్డి స్వప్న

15. కుప్పం – ఎస్. రాజకుమార్

16. మాచర్ల – ఏనుముల సుష్మ

17. మదనపల్లె – శ్రీరామ్ చిన్న బాబు

18. మార్కాపురం – వక్కలగడ్డ మల్లికార్జున

19. నగరి – శ్రీనివాసన్

20. పలాస కాశీబుగ్గ – వజ్జా గంగాభవాని

21.పెద్దాపురం – వత్సవాయి ఎల్.ఎస్.ఎన్. రాజు

22. పెనుకొండ – త్రివేంద్ర మూర్తి

23. పులివెందుల – తుగుట్ల గీతా కుమారి

24. రాజంపేట – డాక్టర్ దొంతం గాయత్రి

25. రామచంద్రాపురం – మేడిశెట్టి శేషారావు

26. రాయచోటి – ఖాదర్ వలి షేక్

27. రాయదుర్గం – టంకశాల హనుమంతు

28. రేపల్లె – కె. అపర్ణ

29. సూళ్లూరుపేట – పిట్టల సుహాసిని

44
ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే...
Image Credit : X/JaiTDP

ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే...

రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి కీలక దశలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు…

అక్టోబర్ 16 : నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అక్టోబర్ 18 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

అక్టోబర్ 19 : నామినేషన్ల పరిశీలన

అక్టోబర్ 21 : అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

అక్టోబర్ 28 : పోలింగ్

అక్టోబర్ 29 : అవసరమైతే రీపోలింగ్

అక్టోబర్ 30 : ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

టీడీపీ రెండు జాబితాల ద్వారా అభ్యర్థులను ప్రకటించగా, ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనుంది.

మొత్తంగా టీడీపీ విడుదల చేసిన రెండు జాబితాల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. ఆయా పట్టణాల్లో అభ్యర్థులకు లభించే ప్రజాదరణ, స్థానిక సమస్యలపై వారి వైఖరి, పార్టీ బలం ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలుగుదేశం పార్టీ
నారా చంద్రబాబు నాయుడు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP
Recommended image2
స్థానిక ఎన్నికలకు జనసేన తొలి జాబితా.. 14 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు
Recommended image3
Now Playing
పుంగనూరు కేసులో కీలక ట్విస్ట్!!సీసీటీవీ లో బయటపడ్డ భయంకర నిజాలు | YCP MP Mithun Reddy
Related Stories
Recommended image1
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు షురూ.. రాయచోటి, పుంగనూరులో ఉద్రిక్తత
Recommended image2
స్థానిక ఎన్నికలకు జనసేన తొలి జాబితా.. 14 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved