- Home
- Andhra Pradesh
- నిరుద్యోగులకు పండగే.. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 82 వేల కోట్లతో భారీ పెట్టుబడి, వేల ఉద్యోగాలు
నిరుద్యోగులకు పండగే.. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 82 వేల కోట్లతో భారీ పెట్టుబడి, వేల ఉద్యోగాలు
Andhra pradesh: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. తాజాగా రెన్యూ పవర్ కంపెనీ ఏకంగా రూ. 82వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు.

రూ. 82వేల కోట్ల పెట్టుబడి
ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ ReNew Power ఆంధ్రప్రదేశ్‌లో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో సోలార్ ప్యానెల్ తయారీ, వాఫర్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఉంటాయి. ఈ విషయమై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “ఐదు సంవత్సరాల తర్వాత ReNew Power మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తోంది. ఇది రాష్ట్రానికి పెద్ద గర్వకారణం” అని రాసుకొచ్చారు.
#ChooseSpeedChooseAP#CIIPartnershipSummit2025
After 5 years out of AP, it is my proud privilege to announce that Renew is placing an all-in investment on the entire renewable energy value chain in #AndhraPradesh. In an investment spanning Rs. 82,000 crores, Renew will be… pic.twitter.com/JczVgbtcEO— Lokesh Nara (@naralokesh) November 13, 2025
విశాఖలో మరో డేటా సెంటర్
ఇప్పటికే గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో సంస్థ సైతం డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అమెరికాకు చెందిన టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) సంస్థ విశాఖపట్నంలో రూ. 15,000 కోట్లతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పాట్నర్‌షిప్ ఫోరమ్‌లో సంతకం చేశారు.
భారీగా ఉద్యోగాలు
ఈ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ డేటా సెంటర్ ద్వారా 200 నుంచి 300 ప్రత్యక్ష ఉద్యోగాలు, అలాగే 800 నుంచి 1,000 పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రెన్యూ పవర్ పెట్టుబడితో కకూడా వేల సంఖ్యలో టెక్నికల్, ఇంజినీరింగ్ ఉద్యోగాలు రానున్నాయి.
విశాఖ సదస్సులో రెన్యూ ఒప్పందం
ఇదిలా ఉంటే రెన్యూ పవర్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఎమ్ఓయూపై సంతకం చేయనున్నారు. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికి కేంద్రంగా మార్చనున్నాయి అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.