MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • దుబాయ్ చేరిన ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం.. ఈడీ దర్యాప్తు ముమ్మరం

దుబాయ్ చేరిన ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం.. ఈడీ దర్యాప్తు ముమ్మరం

Andhra Pradesh liquor scam: ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం దర్యాప్తు దుబాయ్ వరకు చేరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొత్త ఆధారాలు సేకరించి నిందితులపై దర్యాప్తును వేగవంతం చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 19 2025, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
దుబాయ్ లో ఏపీ మద్యం స్కాం దర్యాప్తు
Image Credit : Asianet News

దుబాయ్ లో ఏపీ మద్యం స్కాం దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్‌లో కోట్ల రూపాయల మద్యం స్కాం కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా సేకరించిన చాట్ ఆధారాల ప్రకారం కొందరు నిందితులు దుబాయ్‌లో ఉన్నారని తేలింది. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్కామ్ లోని లాభాలను (Proceeds of Crime – POC) కోట్ల రూపాయల మేరకు విదేశాలకు పంపిన రికార్డులు లభించాయి. ఈ మొత్తాలు పరారీలో ఉన్న ప్రధాన నిందితుల ఖాతాలకు బదిలీ చేసినట్టు ఈడీ గుర్తించింది.

దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు

సెప్టెంబర్ 18న ఈడీ హైదరాబాద్‌ జోన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఆంధ్రప్రదేశ్‌లలో 20 ప్రదేశాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, చాట్‌ ఆధారాలు, నకిలీ బిల్లులు, రవాణా చలాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధం లేని వివరాలతో కూడిన రవాణా చలాన్లు కూడా లభించాయి. ఒక ప్రాంగణం నుండి రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు లెడ్జర్లలో విదేశాలకు బదిలీ చేసిన కోట్ల రూపాయల లావాదేవీలు నమోదు అయినట్లు ఈడీ పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ లో సిట్, సీఐడీ కేసులు
Image Credit : freepik

ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ లో సిట్, సీఐడీ కేసులు

ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ కేసు సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వానికి సుమారు రూ.4,000 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు అమల్లో ఉన్న కొత్త మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రముఖ బ్రాండ్లను పక్కన పెట్టి, కొత్త లేదా నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారనీ, 15–20 శాతం కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ను రద్దు చేసి మాన్యువల్ ఆమోదాలను అమలు చేయడం వల్ల అక్రమాలకు అవకాశం లభించిందని సిట్ ఛార్జీషీట్లో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ తాజా దర్యాప్తు విషయాలు

ఈడీ దర్యాప్తులో నిందితులు ప్రముఖ బ్రాండ్ల ఆర్డర్లను అడ్డుకున్నట్లు, డిస్టిలరీలకు చెల్లించాల్సిన బిల్లులు నిలిపివేసినట్లు తేలింది. అక్రమ కమీషన్ల కోసం ఒత్తిడి తెచ్చినట్లు కూడా బయటపడింది. APSBCL నుండి సరఫరాదారులకు చెల్లించిన కొంత మొత్తం నకిలీ సంస్థలకు బదిలీ అయ్యింది. ఈ లావాదేవీలు వాస్తవానికి లేవని, పలు నకిలీ కంపెనీలు, షెల్‌ సంస్థలు నిధుల తరలింపుకు వాడినట్లు ఈడీ పేర్కొంది. బంగారం కొనుగోలు చేసి నగదు రూపంలో నిందితులకు అందించినట్లు కూడా ఆధారాలు లభించాయి.

సీఐడీ 2024 జూలైలో దాఖలు చేసిన ఛార్జీషీట్ ప్రకారం.. మాజీ ఐటీ సలహాదారు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నేత, ఎంపీ పి.వి. మిధున్ రెడ్డి ఈ స్కాం ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వీరిద్దరూ అరెస్టు అయ్యారు. రూ.11 కోట్లు నగదు, మద్యం సీసాలు కూడా శంషాబాద్‌లోని ఒక ఫార్మ్ హౌస్‌లో స్వాధీనం చేసుకున్నారు. 30కి పైగా షెల్ కంపెనీల ద్వారా డబ్బును దుబాయ్, ఆఫ్రికాలో భూములు, బంగారం, లగ్జరీ ఆస్తులు కొనుగోలు చేసేందుకు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నారా చంద్రబాబు నాయుడు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chaganti Amazed By The Children Wonderful Performance | Nara Lokesh | Asianet News Telugu
Recommended image2
Now Playing
ఈ ఏజ్ లో బాబుగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి | Asianet News Telugu
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Related Stories
Recommended image1
Dussehra Holidays : దసరా సెలవులు మరో మూడ్రోజులు పెరిగాయోచ్.. తెలుగు స్టూడెంట్స్ ఇక పండగ చేస్కొండి
Recommended image2
Pawan Kalyan: అసెంబ్లీలో TDP Vs జనసేనాని. అదిరిపోయే సమాధానమిచ్చిన పవన్ కళ్యాణ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved