ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ... కూటమి ప్రభుత్వం బంపరాఫర్
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సర్కార్ బడ్జెట్ 2025 ద్వారా గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల లబ్ది జరిగేలా సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. అదేంటో తెలుసా?

Andhra Pradesh Budget 2025
Andhra Pradesh Budget 2025 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ 2025 ద్వారా రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుండటంతో ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వారు ఆశించినట్లే సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలుకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు కావాల్సిన నిధులను ఈ బడ్జెట్ లో కేటాయించారు.
ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుచేస్తోంది చంద్రబాబు సర్కార్. అదనంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని... అదికూడా ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందుకు తగినట్లుగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు.
అనారోగ్యంతో బాధపడే పేద, మధ్యతరగతి ప్రజలు కార్పోరేట్ స్థాయి వైద్యం పొందలేకపోతున్నారు. ఇకపై అలా జరక్కుండా ఏపీలోని ప్రతిఒక్కరు మెరుగైన వైద్యం పొందేందుకే ఈ భీమా పథకాన్ని రూపొందించారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ సంవత్సరం నుండే ఈ భీమా పథకాన్ని అమలు చేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
Andhra Pradesh Budget 2025
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025 లో వైద్యారోగ్య శాఖకు దక్కిన నిధులెన్ని :
గత వైసిపి హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అందుకోసమే ఈ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఏకంగా రూ.19,264 కోట్లు కేటాయించారు.
ఇక గత ప్రభుత్వం ఈ వైద్యారోగ్య శాఖలో భారీగా బకాయిలు పెట్టారని... వాటిని కూడా చెల్లిస్తూ వస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం కేవలం ఈ వైద్యారోగ్య శాఖలో రూ.6,400 కోట్లు బకాయి పెట్టిందని... దీంతో ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించినా వీటి చెల్లింపుకే సరిపోతోందని ఆర్థిక మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. అందువల్లే దశలవారిగా ఈ బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని... ఇప్పటికే రూ.1,645 కోట్లు చెల్లించామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
మొత్తంగా ఓవైపు భారీగా నిధులు కేటాయించి... మరోవైపు దశలవారిగా పాత బకాయిలు చెల్లిస్తూ వైద్యారోగ్య రంగాన్ని తిరిగా గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా అనారోగ్యంతో వైద్యం కోసం వచ్చేవారిని డాక్టర్లు, సిబ్బంది, మందులు,సౌకర్యాలు, ఇతర సేవల కొరత లేకుండా మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కార్పోరేట్ వైద్యం అందాలన్నదే తమ లక్ష్యమని పయ్యావుల కేశవ్ తెలిపారు.
Andhra Pradesh Budger 2025
బడ్జెట్ 2025 లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా ప్రజలపై ఆర్థికభారాన్ని తగ్గించే పథకాలు, హామీల అమలుకు సిద్దమైంది. అందులో భాగంగానే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా పథకంతో పాటు చిన్నారుల విద్యాభ్యాసం కోసం తల్లికి వందనం, రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు సిద్దమయ్యారు.
ఇక ఎస్సి, ఎస్టి కుటుంబాలకు విద్యుత్ భారం నుండి ఉపశమనం కల్గించేందుకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. చేనేత,నాయి బ్రాహ్మణులకు కూడా ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. ఎన్టిఆర్ ఫించన్ల నుండి ఇళ్ల నిర్మాణం వరు అనేక ప్రజాసంక్షేమ పథకాల అమలుకి చంద్రబాబు సర్కార్ సిద్దమయ్యింది.