MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • స్కూల్ డ్రాప్ అవుట్ గురించి తెలుసు... మరి ఈ పొలిటికల్ డ్రాప్ అవుట్స్ ఏంటో?

స్కూల్ డ్రాప్ అవుట్ గురించి తెలుసు... మరి ఈ పొలిటికల్ డ్రాప్ అవుట్స్ ఏంటో?

ఏవయినా కారణాలతో స్కూల్ కి వెళ్లకుండా చదువు మానేస్తే వారు డ్రాప్ అవుట్ అయినట్లు. మరి పొలిటికల్ డ్రాప్ అవుట్ ఏమిటి? వైఎస్ జగన్ అలాగే అయ్యారా? మరి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ఎందుకలా అన్నారు? 

2 Min read
Arun Kumar P
Published : Feb 28 2025, 06:36 PM IST | Updated : Feb 28 2025, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
ys jagan

ys jagan

Andhra Pradesh Budget 2025 : ఆంధ్ర ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రోలింగ్ పెరిగిపోయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బరిలోకి దిగిన జగన్ పార్టీకి వచ్చింది కేవలం 11  స్థానాలే. ఇలా ఊహించనివిధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో జగన్ పై ట్రోలింగ్ పెరిగిపోయింది. చివరకు జగన్ పరిస్థితి సీరియస్ గా సాగే బడ్జెట్ ప్రసంగంలో కూడా కామేడీకి వాడుకునేలా తయారయ్యింది.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025 ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ట్రోల్ చేసారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గురించి మట్లాడుతూ వైఎస్ జగన్ పాలనను ఎద్దేవా చేసారు. గతంలో డ్రాప్ అవుట్ పాలన సాగిందంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల ఆసక్తికర కామెంట్స్ చేసారు.
 

23
andhra Pradesh Budget 2025

andhra Pradesh Budget 2025

జగన్ ది డ్రాప్ అవుట్ పాలన : పయ్యావుల కేశవ్ 

గత వైసిపి పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రగం పూర్తిగా దెబ్బతిందని... పరిశ్రమలు నడిపించలేని పరిస్థితి ఉండేదని ఆర్థిక మంత్రి అన్నారు. ఇలా పరిశ్రమలు మూతపడి చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు... చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రం నుండి అనేక పరిశ్రమలను తరిమేసారని...  దీతో ఎప్పుడు ఎవరిపై పడతారోనని వ్యాపారులు భయాందోళనకు గురయ్యేవారని ఆర్థిక మంత్రి తెలిపారు.

సాధారణంగా స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి వింటుంటాం... కానీ గత పాలనలో ఏపీలో అనేక రకాల డ్రాప్ అవుట్స్ ఉండేవన్నారు. వైసిపి హయాంలో స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ సహజంగానే పెరిగాయి... ఇవే కాకుండా పరిశ్రమలు కూడా డ్రాప్ అవుట్ అయ్యాయన్నారు. రాష్ట్రం నుండి ఉద్యోగాలు కూడా డ్రాప్ అవుట్ అయ్యాయన్నారు. పేదలకు ఉపాధి కూడా డ్రాప్ అవుట్ అయ్యిందని పయ్యావుల ఎద్దేవా చేసారు. 

రాష్ట్రంలో ఇన్నిరంగాల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోడానికి  వైసిపి పాలనే కారణం... ఇది ప్రజలు గుర్తించారు కాబట్టే వారిని ఓడించి డ్రాప్ అవుట్ చేసారని పయ్యావుల అన్నారు. అయినాకూడా వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకుల్లో మార్పు రావడంలేదు... ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా డ్రాప్ అవుట్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజా జీవితం నుంచి శాశత్వంగా డ్రాప్ అవుట్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల ఎద్దేవా చేసారు.
 

33
Andhra Pradesh Budget 2025

Andhra Pradesh Budget 2025

పరిశ్రమలు, వాణిజ్య రంగానికి ఏపీ బడ్జెట్ 2025 లో కేటాయింపులు : 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక రంగ అభివృద్దికి కట్టుబడి ఉందని... ఇందులో భాగంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. ఇప్పటికే అనేక కంపనీలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని... ఇందులో అనేక దిగ్గజ కంపనీలు ఉన్నాయన్నారు. ఎన్.టి.పి.సి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపనీ, ఎన్.హెచ్.పి.సి, బి.పి.సి.ఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టిసిఎస్, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, హీరో ప్యూచర్ ఎనర్జీస్, ఎకోరెస్ ఎనర్జీ తదితర సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయన్నారు. ఇలా ఏపీకి రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని...ఈ పరిశ్రమలతో 4 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 

ఇక ఓర్వకల్లు, కొప్పర్తి  పారిశ్రామికవాడలకు ఆర్థిక సాయం అందించి అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ది కార్యక్రమం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు, కుప్పంలను ఎంపికచేసారు... ఈ నాలుగు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేస్తారని పయ్యావుల తెలిపారు. 

మొత్తంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని పయ్యావుల అన్నారు. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని... అందులో భాగంగానే బడ్జెట్ లో రూ.3,156 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. 
 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
నారా చంద్రబాబు నాయుడు
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved