MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Andhra Pradesh
  • Ambati Rambabu Arrest : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్... అసలు ఏమిటీ ప్లెక్సీ వివాదం..?

Ambati Rambabu Arrest : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్... అసలు ఏమిటీ ప్లెక్సీ వివాదం..?

Tirumala Laddu Flexi : తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం మరోసారి రాజకీయ దుమారం రేపింది. చివరకు ఈ వివాదం మాజీ మంత్రి, వైసిపి కీలక నేత అంబటి రాంబాబు అరెస్ట్ కు దారితీసింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 01 2026, 07:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంబటి రాంబాబు అరెస్ట్
Image Credit : X/Ambati Rambabu

అంబటి రాంబాబు అరెస్ట్

Ambati Rambabu Arrest : నాటకీయ పరిణామాల మధ్య మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంబటి ఇంటిపై టిటిడి శ్రేణులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మధ్యనే అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు నివాసంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోనే తరలించారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మాజీ మంత్రిని పోలీసులు నల్లపాడు స్టేషన్ లో ఉంచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలు ఏంటీ వివాదం..?
Image Credit : X/Andhra Pradesh

అసలు ఏంటీ వివాదం..?

పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లడ్డూ తయారీలో స్వచ్చమైన నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వుతో తయారైన చీఫ్ క్వాలిటీ నెయ్యిని వైసిపి హయాంలో వాడినట్లు గతంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఆరోపించాయి. అయితే దీనిపై సిబిఐ విచారణ జరుగుతుండగా మరోసారి వివాదం రాజుకుంది.

అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చిందని వైసిపి... లేదు లేదు వాడారనే సిబిఐ కూడా చెబుతోందని కూటమి నాయకులు అంటున్నారు. ఈ మాటలయుద్దం కాస్త ప్లెక్సీ వార్ గా మారింది... టిడిపి నాయకులు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. దీనిపై వైసిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది... ఈ ప్లెక్సీ వివాదమే అంబటి అరెస్టుకు దారితీసింది.

Related Articles

Related image1
Now Playing
Nimmala Ramanaidu slams Ambati Rambabu: జంతువులు కూడా సిగ్గు పడుతున్నాయి | Asianet News Telugu
Related image2
Now Playing
Paritala Sriram Mass Warning: నోటికొచ్చినట్లు మాట్లాడితే అంతే | Ambati Rambabu | Asianet News Telugu
34
చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్రవ్యాఖ్యలు...
Image Credit : screenshot to YSRCParty

చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్రవ్యాఖ్యలు...

గుంటూరు పట్టణంలో కూడా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఇదే సమయంలో వైసిపి నేత అంబటి రాంబాబు వైసిపి హయాంలో కల్తీ నెయ్యి వాడలేదని సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చిందని... అయినా టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తన్నారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నారంటూ పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళుతుండగా ఆయనను టిటిడి శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇలా తన కారును టిడిపి అడ్డుతగలడంతో అంబటి రాంబాబు ఆవేశంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు... దీంతో టిడిపి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆయన ఇంటిపై దాడి చేశారు... అలాగే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదుచేసి గత రాత్రి అంబటిని అరెస్ట్ చేశారు.

44
అంబటి రాంబాబుపై పెట్టిన కేసులివే...
Image Credit : Getty

అంబటి రాంబాబుపై పెట్టిన కేసులివే...

వైసిపి నేత అంబటి రాంబాబుపై పోలీసులు రెండు కేసులు నమోదుచేశారు. భారత న్యాయ సంహిత (BNS) ప్రకారం 126(2), 132, 196(1),352, 351(2),292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలపై ఆయనపై ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
రాజకీయాలు
తిరుపతి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నారా చంద్రబాబు నాయుడు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
“ఎంత లంచం ఇచ్చావో మర్యాదగా చెప్పు..!” 😡 వార్డెన్‌పై AP Food Commission Chairman ఆగ్రహం..!
Recommended image2
ఏపీలో నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 10,060 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్
Recommended image3
ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే.. ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు
Related Stories
Recommended image1
Now Playing
Nimmala Ramanaidu slams Ambati Rambabu: జంతువులు కూడా సిగ్గు పడుతున్నాయి | Asianet News Telugu
Recommended image2
Now Playing
Paritala Sriram Mass Warning: నోటికొచ్చినట్లు మాట్లాడితే అంతే | Ambati Rambabu | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved