న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ విపణిలోకి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనున్నది. ఇండియాలో తన తొలి 5 జీ ఎంఐ 10 స్మార్ట్‌ ఫోన్‌ను ఈ నెల 31వ తేదీన మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు షియోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. 

అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ అమెజాన్‌ ఆన్‌లైన్‌లో సేల్‌ ప్రారంభం కానున్నది. 

also read హబ్ ద్వారా ఫేక్‌ వార్తల కట్టడి.. వాట్సాప్‌ నిర్ణయం

షియోమీ విడుదల చేస్తున్న ఎం 10 మోడల్ ఫోన్.. చైనాకే చెందిన వన్ ప్లస్ 8 ప్రో, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 మోడల్ ఫోన్లు కూడా ఒకే ధరకు లభించనున్నాయి. వీటి మూడింటిలోనూ దాదాపుగా ఇవే ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు.

12 జీబీ ర్యామ్ విత్ 512 స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌ విత్ 256 స్టోరేజ్‌  ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ఫోన్ ధర రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని అంచనా. 

యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్‌ బ్యాక్‌, డెబిట్‌ కార్డ్‌ ద్వారా రూ. 2 వేల  డిస్కౌంట్‌ సదుపాయాన్ని వినియోగదారులకు లభించనుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

also read అమెరికాలో ఇళ్లకే ప్రజలు పరిమితం ఆపిల్ స్టోర్ల నిరవధిక మూత

ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌​ 6.67 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అలాగే  క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్, 865 సాక్‌ప్రాసెసర్ కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్‌ 10 సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ లభిస్తుంది. 

ఇంకా 8జీబీ ర్యామ్‌ విత్ 128 స్టోరేజ్‌ సామర్థ్యం దీని సొంతం. ఇక 20  ఎంపీ సెల్పీ కెమెరాతోపాటు 108+13+ 2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమరా ఉంటాయి. ఇందులో 4780 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.