వైద్యులారా.. నా బిల్డింగ్‌లను వాడుకోండి: ఫుట్ బాల్ స్టార్ దాతృత్వం

ఐవరీకోస్ట్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్ విల్‌ఫ్రెడ్ జాహా ముందకొచ్చాడు. లండన్‌లో తనకున్న 50 వాణిజ్య భవనాలను వైద్యుల బస కోసం కేటాయించారు

ivari cost Football player wilfried zaha given his apartments for health staff accommodation

కరోనా మహమ్మారి ధాటికి యావత్ ప్రపంచం చివురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. దీని జాడలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచదేశాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిస్ధితుల్లో లాక్‌డౌన్ చేయడమే ఒక్కటే మార్గంగా భావించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

దీని నియంత్రణా చర్యల్లో భాగంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి పలువురు అభినందనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే  అభినందలే వారికి వ్యక్తిగతంగా సాయం ప్రకటించాడు

Also Read:కనికా బస చేసిన హోటల్‌లోనే దక్షిణాఫ్రికా క్రికెటర్లు

ఐవరీకోస్ట్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్ విల్‌ఫ్రెడ్ జాహా ముందకొచ్చాడు. లండన్‌లో తనకున్న 50 వాణిజ్య భవనాలను వైద్యుల బస కోసం కేటాయించారు. ప్రీమియర్ లీగ్ క్లబ్‌లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే జాహా లీగ్ ద్వారా విల్‌ఫ్రెడ్ వారానికి కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తాడు.

ఈ ప్రాపర్టీలను కార్పోరేట్ క్లయింట్ల అవసరాల కోసం అందుబాటులో ఉంచుతున్న జాహా వీటిని ఇంటికి వెళ్లేందుకు కూడా సమయం లేని వైద్యుల వసతి కోసం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read:బ్రేకింగ్... స్కాట్లాండ్ క్రికెటర్ కి కరోనా

మనం మంచి చేస్తే అదే తిరిగి వస్తుందని, తనకు జాతీయ ఆరోగ్య సేవా సంస్థలో పనిచేసే స్నేహితులు ఉన్నారని, వీరు ఎలాంటి పరిస్ధితుల్లో పనిచేస్తారో తనకు తెలుసునని జాహా చెప్పాడు. ఆరోగ్య సేవలు అందిస్తున్న వారు తన భవనాలను ఉపయోగించుకోవచ్చునని ఆయన తెలిపారు.

జాహా కన్నా ముందు మాంచెస్టర్ యునైటెడ్ మాజీ స్టార్ ప్లేయర్ గ్యారీ నెవెలీ తన హోటల్స్‌లోని 176 గదులను, చెల్సీ యజమాని రోమన్ అబ్రామోవిచ్ 72 గదులను వైద్యుల కోసం  కేటాయించిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios