బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ తేలడంతో ఆమె లక్నోలో ఇచ్చిన పార్టీకి హాజరైన వారిలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మార్చి 11న కనికా కపూర్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నరనే దానిపై వివరాలు సేకరిస్తోంది.

రాష్ట్ర ఆరోగ్య విభాగానికి చెందిన 1,000 మంది సభ్యులతో కూడిన 100 మంది సభ్యుల బృందాలు జల్లెడ పడుతున్నాయి. అయితే భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు కనికా కపూర్ బస చేసిన హోటల్‌లోనే బస చేసినట్లు వస్తున్న వార్తలు ఆందోళణ కలిగిస్తున్నాయి.

Also Read:కరోనాపై కైఫ్ ట్వీట్... అదిరిపోయే రిప్లై ఇచ్చిన ప్రధాని మోదీ

శనివారం ఒక బృందం కనికా బస చేసిన హోటల్‌కు సమీపంలో ఉన్న 22,000 మంది నివాసితులను స్కాన్ చేసింది. మరో నిపుణుల బృందం మార్చి 14 నుంచి 16 వరకు లక్నోలోని ఫైవ్ స్టార్‌ హోటల్‌‌కు  సంబంధించిన వీడియో ఫుటేజీలు, సీసీటీవీ రికార్డులను స్కాన్ చేస్తోంది.

ఆమె హోటల్‌లో బఫే భోజనం చేయడంతో  పాటు లాబీలో పలువురు అతిథులను కూడా కలిసినట్లు నివేదికలు చెబుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన తర్వాత సెల్ఫ్ క్వారంటైన్ కావాల్సింది పోయి కనికా కపూర్ పార్టీలకు వెళ్లి అందరినీ ప్రమాదంలో పడేసిందని లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర అగర్వాల్ అన్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్.. ఇంట్లో బోర్ కొడుతుందా.. కేఎల్ రాహుల్ వీడియో

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను కనికాపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికా  మధ్య వన్డే సిరీస్‌ను  బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.