Asianet News TeluguAsianet News Telugu

భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూత

భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూశారు. డిమెన్షియా, పార్కిన్సన్ సిండ్రోమ్ సహా వయసు రీత్యా సమస్యలతో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 1965 నంచి 1976 మధ్య కాలంలో ఇండియా ఫుట్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు.
 

indian football legend, hyderabadi player mohammad habib died kms
Author
First Published Aug 16, 2023, 12:33 AM IST | Last Updated Aug 16, 2023, 12:33 AM IST

Mohammad Habib Death: భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ మంగళవారం కన్నుమూశారు. 74 ఏళ్ల హబీబ్ కొన్నేళ్ల నుంచి డిమెన్షియా, పార్కిన్సన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ఈ సమస్యలతోనే హైదరాబాద్‌లో ఆగస్టు 15వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు.

హబీబ్ మరణంతో క్రీడాలోకంలో విషాదం నెలకొంది. 1965 నుంచి 1976 కాలంలో ఆయన ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత కోచ్‌గానూ టీమ్‌కు సేవలు అందించారు. 1977లో మోహన్ బగాన్ కోసం కాస్మోస్ క్లబ్‌కు హబీబ్ ప్రత్యర్థిగా దిగారు. ఆ మ్యాచ్‌లో లెజెండరీ పీలే కూడా ఆడటం గమనార్హం.

1970లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన ఇండియా ఫుట్‌బాల్ టీమ్‌లో హబీబ్ ఉన్నారు. ఈ జట్టుకు మరో హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ నయీముద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించారు.

Also Read: వన్డే ఫార్మాట్‌లో బీభత్స రికార్డ్.. 450 పరుగుల తేడాతో ఆ జట్టు సంచలన విజయం

మహమ్మద్ హబీబ్ 1949 జులై 17వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. అదే హైదరాబాద్‌లో 74 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. హబీబ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios