Asianet News TeluguAsianet News Telugu

వన్డే ఫార్మాట్‌లో బీభత్స రికార్డ్.. 450 పరుగుల తేడాతో ఆ జట్టు సంచలన విజయం

వన్డే ఫార్మాట్‌లో అమెరికా అండర్ 19 జట్టు రికార్డులు తిరగరాసింది. అర్జెంటినా జట్టుపై 515 పరుగుల అత్యధిక స్కోర్ సాధించింది. అలాగే.. 450 అతిభారీ పరుగుల తేడాతో విజయం నమోదు చేసుకుంది.
 

america scors 515 and won by 450 runs against match with argentina kms
Author
First Published Aug 15, 2023, 11:33 PM IST

Cricket: వన్డే ఫార్మాట్‌లో బీభత్స రికార్డ్ నమోదైంది. ఎవరూ ఊహించని భారీ విజయాన్ని యూఎస్ఏ అండర్ 19 జట్టు తన పేరిట రాసుకుంది. అర్జెంటీనా జట్టుపై 450 పరుగుల తేడాతో ఘటన విజయం సాధించింది.  ఐసీసీ అండర్ 19 పురుషుల వరల్డ్ కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో ఈ రికార్డ్ నమోదైంది.

టొరంటో వేదికగా ఆగస్టు 14వ తేదీన యూఎస్ఏ, అర్జెంటీనా అండర్ 19 క్రికెట్ జట్టుల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అమెరికా జట్టుకు కనీస పోటీ ఇవ్వడంలోనూ అర్జెంటీనా జట్టుకు సాధ్యపడలేదు. 19.5 ఓవర్లకే ఆలౌట్ అయిన అర్జెంటీనా జట్టు 65 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో యూఎస్ఏ అండర్ 19 టీమ్ 450 పరుగుల భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్ రెండు రికార్డులను తిరగరాసింది. ఒకటి అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా అమెరికా అండర్ 19 టీమ్ రికార్డ్ సాధించింది. అలాగే, అతి భారీ విజయంగానూ రికార్డును తన వశం చేసుకుంది. ఇది వరకు వన్డే ఫార్మాట్ చరిత్రలో ఒక జట్టుపై మరో జట్టు 450 పరుగుల తేడాతో గెలిచిన దాఖాలాలు లేవు.

ఈ మ్యాచ్ కంటే ముందు అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా ఉన్నది. 2002లో కెన్యాపై  ఆసిస్ 480 పరుగులు సాధించింది. ఈ రికార్డును అమెరికా జట్టు తిరగరాసింది. అండర్ 19 ఫార్మాట్‌లో 500 పరుగులు సాధించిన తొలి జట్టుగానూ రికార్డ్ సృష్టించింది. మొత్తంగా లిస్ట్ ఏ క్రికెట్‌ (అంతర్జాతీయ వన్డేలు, దేశావలీ వన్డేలు)లోనూ అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా అమెరికా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు అరుణాచల్ ప్రదేశ్ పై 2002లో 506 పరుగులు సాధించిన తమిళనాడు టీమ్ పేరిట ఉంది. అతిభారీ విజయంగానూ తమిళనాడు పేరిట ఉన్న రికార్డు ఈ టీమ్ తిరగరాసింది.

Also Read: గ్రూప్ 4 రిజల్ట్స్ పై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్య

అర్జెంటినా పై అమెరికా టీమ్ ఆడింది. అమెరికా తరఫున భవ్య మెహతా (136 పరుగులు), రిషి రమేశ్ (100) పరుగులు సాధించి సెంచరీలు చేయగా.. మరో ఇద్దరు ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) హాఫ్ సెంచరీలు చేశారు. అంతేకాదు, అమోఘ్ ఆరేపల్లి 48 పరుగులు, ఉత్కర్ష్ శ్రీవత్సవ 45 పరుగులు సాధించి భారీ స్కోర్‌కు బాధ్యత వహించారు. అమెరికా 515 పరుగులు సాధించగా.. అర్జెంటీనా 19.5 ఓటర్లలో 65 పరుగులకే అన్ని వికెట్లను నష్టపోయింది. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియే అత్యధికంగా 18 పరుగులు సాధించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios