Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌కి మరో భంగపాటు.. U19 SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాక్‌ని చిత్తు చేసిన టీమిండియా..

SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 3-0 తేడాతో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్న భారత అండర్19 ఫుట్‌బాల్ టీమ్..

India won the U-19 SAFF Championship by beating Pakistan 3-0 in football CRA
Author
First Published Sep 30, 2023, 7:51 PM IST

శనివారం, పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఉదయం ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత పురుషుల స్క్వాష్ టీమ్, పాకిస్తాన్‌ని ఓడించి స్వర్ణం సాధించింది. సాయంత్రం భారత అండర్19 పురుషుల ఫుట్‌బాల్ టీమ్, SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 3-0 తేడాతో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది..

ఆట మొదటి రెండు క్వార్టర్లలో ఇరు జట్ల ఆటగాళ్లు ఎవ్వరూ గోల్ చేయలేకపోయారు. 64వ నిమిషంలో గోల్ చేసిన భారత ప్లేయర్ కిప్‌జెన్, బోణీ కొట్టాడు. ఆ తర్వాత ఆట 85వ నిమిషంలో కిప్‌జెన్ నుంచి మరో గోల్ వచ్చింది. ఆట 95వ నిమిషంలో గోయరీ మరో గోల్ చేయడంతో టీమిండియా 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంతో ఫైనల్‌ని ముగించి, టైటిల్ కైవసం చేసుకుంది.. 

సెమీ ఫైనల్‌లో నేపాల్‌పై 1-1 (3-2) తేడాతో పెనాల్టీ షూటౌట్‌లో విజయం అందుకుని, ఫైనల్‌కి వచ్చింది భారత యువ ఫుట్‌బాల్ జట్టు. 

 భారత్‌కి  ఇది మూడో U19  SAFF ఛాంపియన్‌షిప్ టైటిల్. ఇంతకుముందు 2019లో U18 ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని 2-1 తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది యువభారత్..

2015లో అండర్19  SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నేపాల్ చేతిలో 1-1 (5-4) తేడాతో షూటౌట్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచింది భారత్.  2022లో అండర్20 ఫార్మాట్‌లో జరిగిన  SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని 5-2 తేడాతో ఓడించి రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది భారత్..

ఈ ఏడాది జూలై 4న జరిగిన SAFF ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సునీల్ ఛెత్రీ కెప్టెన్సీలోని భారత సీనియర్ ఫుట్‌బాల్ టీమ్ కైవసం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios