జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచకప్ హీరో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ క‌న్నుమూత

German football legend Franz Beckenbauer: కెప్టెన్ గా, కోచ్ గా ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ముగ్గురిలో ఒకరైన జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్ బౌర్ (78) నిద్రలోనే కన్నుమూశారు. మిడ్ ఫీల్డర్ గా కెరీర్ ప్రారంభించిన బెకెన్ బౌర్ ఫార్వర్డ్ గా పేరు తెచ్చుకుని బేయర్న్ మ్యూనిచ్ తో కలిసి పలు క్లబ్ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు.
 

German football legend and World Cup hero Franz Beckenbauer passes away, life history and  details RMA

German football legend Franz Beckenbauer: జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచకప్ హీరో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ తుదిశ్వాస విడిచారు. 78 ఏండ్ల  బెకెన్‌బౌర్ సోమవారం నిద్రలోనే కన్నుమూశారు. ఆటగాడిగా, కోచ్ గా ఫిఫా ప్రపంచ కప్ గెలిచిన ముగ్గురిలో ఒకరైన బెకెన్ బౌర్ 1960-70 లలో పశ్చిమ జర్మనీ, బేయర్న్ మ్యూనిచ్ లకు ఫుట్ బాల్ మైదానంలో ఒక మహోన్నత వ్యక్తి. బెకెన్‌బౌర్ 1974 లో పశ్చిమ జర్మనీకి నాయకత్వం వహిస్తూ ప్రపంచ కప్ గెలిచాడు. 1990 లో కోచ్ గా మరోసారి తన దేశానికి ట్రోఫీని అందించాడు.

ఫ్రాంజ్ బెకెన్బౌర్ నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ప్ర‌క‌టించారు. డెర్ కైజర్ (చక్రవర్తి) అని ముద్దుగా పిలువబడే బెకెన్‌బౌర్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కోచ్ గా, ఆటగాడిగా ప్రపంచ కప్ గెలిచిన మొదటి వ్యక్తి, బ్రెజిల్ కు చెందిన మారియో జగాలో మరణించిన మూడు రోజుల తర్వాత బెకెన్‌బౌర్ కూడా తుది శ్వాస విడిచాడు. పశ్చిమ జర్మనీ తరఫున 103 మ్యాచ్ లు ఆడిన బెకెన్ బౌర్ కు ప్రపంచం నలుమూలల నుంచి నివాళులు వెల్లువెత్తాయి.

ROHIT SHARMA: అరుదైన రికార్డు సృష్టించ‌డానికి సిద్ధంగా రోహిత్ శ‌ర్మ‌.. !

 

మిడ్ ఫీల్డర్ గా కెరీర్ ప్రారంభించిన బెకెన్ బౌర్ ఫార్వర్డ్ గా పేరు సంపాదించాడు. అంతర్జాతీయంగా 79 క్లబ్ గోల్స్, 14 గోల్స్ సాధించాడు. 1972-1976 లలో రెండుసార్లు బాలన్ డి'ఓర్ గెలుచుకున్న బెకెన్‌బౌర్.. బేయర్న్ మ్యూనిచ్ తో ఆటగాడిగా గొప్ప ప్రదర్శన చేశాడు, నాలుగుసార్లు బుండెస్లిగా, మూడు సార్లు యూరోపియన్ కప్ గెలుచుకున్నాడు. మేనేజర్ గా, బెకెన్ బౌర్ బయర్న్ మ్యూనిచ్ కు బాధ్యత వహిస్తూ బుండెస్లిగా, UEFA కప్ ను గెలుచుకున్నాడు. అలాగే, మార్సెల్లెతో కలిసి లిగ్యూ 1 గెలుచుకున్నాడు.

జర్మనీ ప్రస్తుత ప్రధాన కోచ్ జూలియన్ నాగెల్స్ మన్ బెకెన్ బౌర్ ను తమ దేశానికి ఉత్తమ ఫుట్ బాల్ క్రీడాకారుడిగా పేర్కొన్నాడు. ఆ మహానుభావుడికి హృదయపూర్వక నివాళి అంటూ.. అత‌ను ఒక గొప్ప వ్య‌క్తి అనీ, జర్మన్ ఫుట్బాల్ లైటింగ్ ఫిగర్ అని పేర్కొన్నాడు. 

T20 World Cup 2024: ఇద్ద‌రూ టీమిండియాలో ఉండాల్సిందే.. రోహిత్, కోహ్లీల‌కు మ‌ద్ద‌తుగా సౌర‌వ్ గంగూలీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios