అమ్మా... రొనాల్డో నీ నైటీ ఎందుకు వేసుకున్నాడు...

 రొనాల్డో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటోపై విపరీతమైన ట్రోల్స్... ఫన్నీ కామెంట్లతో, ఎడిట్ ఫోటోలతో క్రియేటివిటీ చూపిస్తున్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్...

Fans trolled Cristiano Ronaldo for wearing funny Dress

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేంద్ర సింగ్ ధోనీ, మహేశ్ బాబు వంటి స్టార్లు కూడా రొనాల్డోకి వీరాభిమానులు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రీడాకారుల్లో ఒక్కడైన రొనాల్డో, ఈ ఏడాది ఫోర్బ్స్ ఖరీదైన ఫుట్‌బాల్ ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

తాజాగా రొనాల్డో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటోపై విపరీతమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి.  రొనాల్డో వేసుకున్న  డ్రెస్... నైటీలా కనిపిస్తూ ఉండడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.అందులో ఓ వ్యక్తి... ‘అమ్మా... రొనాల్డో నీ నైటీ ఎందుకు వేసుకున్నాడు...’ అంటూ కామెంట్ చేయగా, మరో వ్యక్తి ‘పాపం ఈ పేదవాడికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. ఎవ్వరైనా సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేశాడు.

మరికొందరైతే రొనాల్డో ఫోటోను రకరకాలుగా ఎడిట్ చేసి, కామెంట్ చేస్తున్నారు. ఆ క్రేజీ ఎడిట్స్ మీరు కూడా చూసేయండి.

 

;

 

 

 

 

 

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios