మరికాసేపట్లో మ్యాచ్ అనగా కూలిన గ్రౌండ్ గ్యాలరీ.. 50మందికి గాయాలు
గతేడాది డిసెంబర్ 29వ తదేీన ఆల్ ఇండియా సెవెన్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆర్ ధనరాజన్ అనే క్రీడాకారుడు గుండెపోటుతో మరణించాడు. దీంతో...అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు సేకరించాలని ఈ మ్యాచ్ నిర్వహించారు. కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇలా గ్యాలరీ కూలింది.
మరికాసేపట్లో ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అనగా... గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక గ్యాలరీ కూలిపోయింది. ఈ సంఘటన కేరళలోని పాలక్కాడ్ ఫుట్ బాల్ గ్రౌండ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 50మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇండియన్ ఫుట్ బాల్ ప్రముఖులు ఐఎమ్ విజయన్, భైచుంగ్ భూటియా అక్కడే ఉండటం గమనార్హం.
అయితే...వాళ్లు క్షేమంగా ఉన్నారని.. వాళ్లకి ఏమీకాలేదని నిర్వాహకులు చెప్పారు. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షుల్లో 50మంది గాయాలపాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. అందరికీ స్వల్ప గాయాలే అయ్యాయని.. ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు.
Also Read మ్యాచ్ రివ్యూ: బాకీ తీర్చుకున్న రోహిత్... లెక్క సరిచేసిన కోహ్లీ...
కాగా... గతేడాది డిసెంబర్ 29వ తదేీన ఆల్ ఇండియా సెవెన్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆర్ ధనరాజన్ అనే క్రీడాకారుడు గుండెపోటుతో మరణించాడు. దీంతో...అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు సేకరించాలని ఈ మ్యాచ్ నిర్వహించారు. కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇలా గ్యాలరీ కూలింది.
ఈ ఘటనపై పాలక్కాడ్ ఎంపీ వీకే శ్రీకందన్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్యాలరీ కూలిపోవడం దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తోంది. గాయపడినవారికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, వాలంటీర్లు సాయం అందించారు’ అని తెలిపారు.