Asianet News TeluguAsianet News Telugu

కరోనా సోకి... ఫుట్ బాల్ కోచ్ మృతి

లుకేమియా వ్యాధితో  బాధపడుతున్న ఫ్రాన్సిస్కో గార్సియాకు కరోనావైరస్ సోకడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 21 ఏళ్ల ఫుట్‌బాల్ యువ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కరోనా వైరస్ తో మరణించాడని అట్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ ప్రకటించింది. 

21-year-old Spanish football coach Francisco Garcia becomes youngest Coronavirus victim in Malaga
Author
Hyderabad, First Published Mar 17, 2020, 9:21 AM IST

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తొలుత చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకు కూడాపాకేసింది. జలుబు, తుమ్ము, జ్వరం వంటి లక్షణాలతో మొదలౌతున్న ఈ వైరస్.. కొద్దిరోజులకే ప్రాణాలను మింగేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 7వేల మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Also Read ఒలింపిక్స్ కు కరోనా దెబ్బ: ఖాళీ స్టేడియంలోనే.....

తాజాగా స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కరోనావైరస్‌తో మరణించాడు. లుకేమియా వ్యాధితో  బాధపడుతున్న ఫ్రాన్సిస్కో గార్సియాకు కరోనావైరస్ సోకడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 21 ఏళ్ల ఫుట్‌బాల్ యువ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కరోనా వైరస్ తో మరణించాడని అట్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ ప్రకటించింది. 

‘‘దురదృష్ణ వశాత్తు కరోనా వైరస్ తో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లి పోయిన మా కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కుటుంబానికి, అతని బంధువులు, స్నేహితులకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం’’ అంటూ అట్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ విడుదల చేసిన ఓ సంతాపసందేశంలో పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ముందుజాగ్రత్త చర్యగా స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ను రెండు వారాల పాటు వాయిదా వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios