అక్కడ పేదలకు బిర్యానీ ఉచితం..!
కరోనా సమయంలో.. తిండిలేక ఇబ్బంది పడుతున్న వారికి ఓ మహిళ ఉచితంగా బిర్యానీ పంచిపెడుతోంది. ఆమె పేదల పట్ల చూపిస్తున్న మానవత్వాన్ని గుర్తించిన ఓ వ్యక్తి ఆమెను ఫోటోలు తీసి.. ట్విట్టర్ లో షేర్ చేశాడు.
కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో కేసులు మరింత ఎక్కువగా నమోదౌతున్నాయి. మహమ్మారి విజృభిస్తుండటంతో... ఎవరూ బయటకు రావద్దని.. క్షేమంగా ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే.. ఇంట్లోనే కూర్చుంటే.. కడుపు నిండక.. ఆకలి చావులు తప్పవని బాధపడే పేదలు చాలా మందే ఉన్నారు.
ఇలాంటి సమయంలో ఓ మహిళ మానవత్వం చాటుకుంది. తినడానికి తిండి లేని పేదలకు ఉచితంగా బిర్యానీ అందిస్తోంది. ఈ సంఘటన కొయంబత్తూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా సమయంలో.. తిండిలేక ఇబ్బంది పడుతున్న వారికి ఓ మహిళ ఉచితంగా బిర్యానీ పంచిపెడుతోంది. ఆమె పేదల పట్ల చూపిస్తున్న మానవత్వాన్ని గుర్తించిన ఓ వ్యక్తి ఆమెను ఫోటోలు తీసి.. ట్విట్టర్ లో షేర్ చేశాడు.
ఓ చెట్టు కింద చిన్న బండి పెట్టుకొని ఆమె బిర్యానీ అందిస్తోంది. పక్కనే ఓ బోర్డు కూడా ఆమె పెట్టింది. దాని మీద ‘ ఆకలిగా ఉందా..? వచ్చి బిర్యానీ తీసుకువెళ్లండి’ అంటూ బోర్డు పెట్టడం గమనార్హం.
మానవత్వం ఇంకా మిగిలే ఉంది అంటూ.. ఆమె ఫోటోలు షేర్ చేసిన వ్యక్తి పేర్కొనగా.. అతని ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ ని 23వేల మంది లైక్ చేయగా... 3వేల మంది రీట్వీట్ చేశారు. ఆమె గొప్పతనంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.