Asianet News TeluguAsianet News Telugu

రాత్రిపూట వీటిని తింటే గ్యాస్ వస్తుందట జాగ్రత్త..

రాత్రిళ్లు తినే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇది ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. లేకపోతే రాత్రి మొత్తం నిద్రపోరు. అలాగే ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

never add these  types of food in dinner to avoid acidity gas and heartburn rsl
Author
First Published May 11, 2023, 4:28 PM IST

రాత్రిపూట ఆయిల్ ఫుడ్, ఆల్కహాల్, బీర్, వేయించిన పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ పదార్థాలన్నీ మన శరీరంలో ఎన్నో సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా వీటిని రాత్రి పూట తింటే తగినంత నిద్ర రాదు. కడుపులో ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడుతుంది. 

అధ్యయనం ఏం చెబుతోందంటే..

పబ్ మెడ్ సెంట్రల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎస్ఎఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా అధ్యయనంలో.. ఎక్కువ మసాలా, ఎక్కువ ఆహారం, కెఫిన్, తక్కువ ఫైబర్ ఆహారాన్ని తీసుకోవడం ఎసిడిటీకి దారితీస్తుందని కనుగొన్నారు. కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంథి ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది. వీటిని రాత్రిపూట తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.

కడుపులో యాసిడ్ లేదా గ్యాస్ ఏర్పడటానికి మన ఆహారమే కారణమని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకున్నంత మాత్రాన శరీరానికి ప్రయోజనాలు లభించవు. పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సమయంలో తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

కడుపులో సమస్య ఎక్కువగా, తప్పుగా తినడం వల్లే వస్తుంది. ఉదర సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా మనం వేయించిన, స్పైసీగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆ తర్వాత ఏ టైంలో తింటున్నామో చూసుకోవాలి. రాత్రి పూట ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తీపి లేదా కెఫిన్ కలిగిన ఆహారాలు

రాత్రిపూట తప్పుడు ఆహారం తినడం వల్ల కడుపులో గ్యాస్ లేదా ఎసిడిటీ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు తీయని స్నాక్స్ ను తినకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. వీటితో పాటుగా కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం మానుకోవాలి. టీ, సోడా, కాఫీ లేదా కొన్ని డెజర్ట్ లో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇవి కూడా గ్యాస్ కు దారితీస్తాయి. 

బర్గర్లు

గ్యాస్ లేదా యాసిడ్ సమస్యలను నివారించడానికి రాత్రిపూట హెవీ ఫుడ్ ను తినకూడదు. దీని నుంచి ఉపశమనం పొందడానికి టైరామిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోకూడదు. టైరామిన్ సోయా సాస్, టమోటాలు, రెడ్ వైన్, వైట్ సాస్ లో ఉంటుంది.  హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా పొట్టకు హాని కలుగుతుంది. ఫ్రైస్, బర్గర్లు, పిజ్జా, ఆయిల్ నాన్ వెజ్ వంటివి రాత్రిపూట మానుకోవాలి.

స్పైసీ సాస్ లేదా ఆహారం

రాత్రి పూట తినడానికి బదులుగా పగటిపూట స్పైసీ ఫుడ్స్ తినడానికి ప్రయత్నించండి. పచ్చి ఉల్లిపాయలు, వైట్ వైన్, బీర్, వైన్, టొమాటో సాస్ తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. రాత్రిపూట స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండాలంటే తేలికపాటి ఆహారాన్నే తీసుకోవాలి.

గ్యాస్ లేదా గుండెల్లో మంట ఉన్నప్పుడు ఏం చేయాలి? 

కడుపు చికాకు, యాసిడ్ లేదా ఎసిడిటీని నివారించడానికి పాలకు బదులుగా హెర్బల్ టీ ని తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

అంతేకాకుండా లవంగాలను నమలడం వల్ల కూడా ఎసిడిటీ ఏర్పడకుండా ఉంటుంది. 

ఉసిరికాయను నల్ల ఉప్పుతో కలిపి లేదా ఉడకబెట్టిన లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

కావాలనుకుంటే ఉసిరికాయలో కలబంద రసం మిక్స్ చేసి తాగొచ్చు. ఇది కడుపులో గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కడుపులో మంటగా ఉన్నప్పుడు తులసి ఆకులను నమలడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios