50 ఏళ్లు దాటిన పురుషులు.. వీటికి దూరంగా ఉండటమే మంచిది..!
ముఖ్యంగా పురుషులు 50ఏళ్లు దాటిన తర్వాత ఆహారం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉండాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం...
ఆరోగ్యంగా ఉండకూడదని ఎవరూ కోరుకోరు. ప్రతి ఒక్కరూ బతికినంత కాలం ఎలాంటి సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటారు. అయితే, ఆ ఆరోగ్యం మనకు లభించాలి అంటే, మనం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంతో పాటు, మనం ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకోవాలి. ముఖ్యంగా పురుషులు 50ఏళ్లు దాటిన తర్వాత ఆహారం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉండాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం...
మరీ ముఖ్యంగా 50ఏళ్ల తర్వాతే ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు అంటే, ఆ వయసుకు వచ్చిన తర్వాత ఎక్కువగా గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం , అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి, వారు ఈ సమస్యల బారిన కూడా పడకుండా ఉండేందుకు సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం, ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ఉప్పు , చక్కెరలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
50ఏళ్లు దాటిన తర్వాత పురుషులు పేస్ట్రీలను ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే, ఒక సాధారణ టోస్టర్ పేస్ట్రీలో 190 కేలరీలు లేదా అంతకంటే ఎక్కువ, చక్కెరను జోడిస్తారు. ఎక్కువ ప్రోటీన్ లేదా ఫైబర్ ఉండవు. అందుకే వీటిని దూరం పెట్టాలి. దానికి బదులు ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. 50 ఏళ్లు పైబడిన వారు రోజుకు 100 గ్రాముల (గ్రా) ప్రోటీన్‌ను లేదా ప్రతి భోజనానికి 25 నుండి 30 గ్రా వరకు తీసుకోవాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతార.
వృద్ధాప్యంలో సాధారణంగా శరీరంలోని గుజ్జు తగ్గిపోయి సన్నగా అయిపోతారు. మజిల్ లో పవర్ తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వారికి ప్రోటీన్ చాలా అవసరం అవుతుంది. అంతేకాకుండా ఇది సంపూర్ణత్వ భావనను పెంచే మరియు ఆకలిని తగ్గించే సంతృప్తికరమైన హార్మోన్ల విడుదలను ప్రేరేపించడం ద్వారా బరువు పెరగడాన్ని ఆపడానికి సహాయపడుతుంది. అదనంగా, అధిక-ప్రోటీన్ అల్పాహారం రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది.
కాబట్టి, 50ఏళ్లు దాటిన తర్వాత జంక్ ఫుడ్స్ కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారానికి సైతం దూరంగా ఉండటం మంచిది. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం , ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ కోసం గుడ్డు, అలానే తృణ ధాన్యాలు, పండ్లు,బెర్రీలను ఆహారంలో తీసుకోవాలి.
అంతేకాదు ఫ్యాటీ మీట్స్, వైట్ చాక్లెట్స్, చీజ్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు సైతం దూరంగా ఉంటే, ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు.