ఆప్రికాట్ ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటారు..!
ఆప్రికాట్స్ లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే కాకుండా కెరోటినాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా ఇందులో ఉంటాయి.
ఆప్రికాట్.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? రుచికి చాలా బాగుంటాయి. రెగ్యులర్ గా వీటిని అందరూ పెద్దగా తినరు. కానీ.. ఈ ఆ ప్రికాట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే... కచ్చితంగా రోజూ తింటారట. మనం ఆరోగ్యంగా ఉండేందుకు.. మన శరీరానికి ఎన్ని న్యూట్రియంట్స్ అవసరమో.. అన్ని న్యూట్రియంట్స్.. ఆప్రికాట్ లో పుష్కలంగా ఉంటాయట. మరి, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...
ఆప్రికాట్స్ లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే కాకుండా కెరోటినాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆప్రికాట్స్ రెగ్యులర్ గా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
1. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
స్థూలకాయం ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. దీనికోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బరువు తగ్గాలనుకుంటే, డ్రై ఆప్రికాట్లు ఖచ్చితంగా మీకు సహాయపడతాయి. అవును, ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు మీ ఆకలి బాధలను అరికడుతుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు.
2. రక్తహీనతను నివారిస్తుంది:
డ్రై ఆప్రికాట్ ఫ్రూట్ శరీరంలో ఐరన్ లోపాన్ని పూరించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఈ పండు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత నివారిస్తుంది.
3. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:
ఎండిన ఆప్రికాట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, దీని వినియోగం జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతుంది. దీని ద్వారా మలబద్ధకం సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చు. కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ పండును తినడం చాలా మంచిది. అదేవిధంగా, మీరు మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజూ ఈ పండును తినవచ్చు.
4. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును క్రమం తప్పకుండా తినాలి.
5. కంటి ఆరోగ్యానికి మంచిది:
నేరేడు పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈ పండు తినడం వల్ల కంటి చూపు పెరగడంతో పాటు శుక్లాల సమస్యను దూరం చేసుకోవచ్చు.
6. గుండె ఆరోగ్యానికి మంచిది:
ఈ పండులో బీటా కెరోటిన్ , విటమిన్ ఎ, సి, ఇ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పండు తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
7. మెరుగైన జీవక్రియ:
నేరేడు పండు తినడం వల్ల జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఎదుగుదల వేగంగా జరిగి శరీరం చురుగ్గా ఉంటుందనడంలో సందేహం లేదు.