Asianet News TeluguAsianet News Telugu

కార్తీక పౌర్ణమినాడు.. జ్వాలాతోరణ మహోత్సవం ఎందుకు చేస్తారు..?

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశవపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష.

Karthika Pournami Jwala Thoranam Mahotsavam
Author
Hyderabad, First Published Nov 11, 2019, 9:22 AM IST

కార్తీక పౌర్ణమిరోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు.

కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాటిం ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాలయాలముందు రెండు కర్రలు నిలువుగా పాతి, ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా ప్టిెన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంటపెడతారు. ఆ మంట కిందనుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ, ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశవపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమిరోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటూ వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కాక్షం లభిస్తుంది.  అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి.

మరో విషయం. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివా! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువిం తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పటం.

ఈ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారాంలోనో పెడతారు. అది ఉన్నచోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సుఖశాంతులు కలుగుతాయని జనాలకు నమ్మకం.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios