డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మనకు రాశులు ఎలా ఉంటాయో దేశానికి, ఇతర దేశాలకు కుడా అలానే ఉంటాయి. ఈ పద్దతిలో చూడగా మన భారత దేశం మకరరాశికి చెందినది, ప్రస్తుత కాలంలో దేశ గోచార గ్రహస్థితి అంతగా అనుకూలంగా లేదనే చెప్పాలి. మకరరాశికి  ఏలినాటి శని ప్రభావం తృతీయ అంకం నడుస్తుంది. శుభ గ్రహమైన గురువు మకరరాశిలో ఉండటం వలన గురువుకు నీచ స్థానం అయ్యింది. తత్ ఫలితంగా నీచపడ్డ గురువు మేలు కలిగించలేడు, కనీసం అడ్డుకోనూలేడు. కుజుడు మే 4 తేదీ రాత్రి 8 :40 నిమిషాలకు మకరరాశి నుండి ధనిష్టా నక్షత్రం నాల్గవ పాదం కుంభరాశిలోకి ప్రవేశం చేసాడు. కుజ గ్రహం కుంభరాశిలో శత్రువుగా మారతాడు.

కాలసర్ప యోగాకాలం:- మే 10 నుండి మే 26 వరకు కాలసర్ప ప్రభావంతో ఉంటుంది. ధనుస్సురాశిలో కేతువు, మిధునరాశిలో రాహువులు ఉన్నారు వీరి ఇరువురి మధ్యలో మిగితా గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. జూన్ 8 వ తేది నుండి జూన్ 22 వరకు కుడా కాలసర్ప ప్రభావంతో ఉంటుంది. 10 మే 2020 నుండి 25 జులై 2020 వరకు అతిచారంలో ఉన్న గురువు, వక్ర స్థితి  పొందిన శని వలన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తలతో ఉండాలి.

అతిచారంలో గురువు ఉండగా అదే సమయంలో శని వక్రించి ఉంటే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ప్రపంచమంతా హాహాకారములు చేయును. చాలా దేశాలు దుర్బిక్షంతో విలవిలలాడుతాయి అని జ్యోతిష ఫలితాలు సూచిస్తున్నాయి.

వక్రస్థీతే భానుసుతే రిభీతి: స్యాదర్ఘవృద్దిర్మహితి చ వృష్టి!
దశార్ణదేశాయ వనాశ్చ  నష్టా: పురోహితా విప్రభిషద్ నృపాల:

దీని భావం ఏమనగా మకరరాశిలో శని ఉన్నప్పుడు శత్రుభయాలు ఏర్పడుతాయి. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అతివృష్టి ప్రభావం ఏర్పడుతుంది. దేశ నాయకులకు , వైద్యులకు ఎక్కువ శ్రమతో కూడుకున్న సమయం. పురమునకు హితం కోరే పురోహితులకు కుడా గడ్డుకాలంగా చెప్పబడుతున్నది. ఈ గ్రహచారంతో శత్రు భయాలు, దొంగతనాలు, అగ్ని వలన భయాలు, అతి లేకా అనావృష్టి వలన అనేక నష్టములు, ముఖ్యంగా ఆనారోగ్యంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సంవత్సరం గురువు మకర, కుంభరాశులలో సంచారం చేయుటవలన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలకు నష్టం కల్గుతుంది, కొత్త కొత్త వైరస్ లతో అంతుచిక్కని రుగ్మతులు, మత , ప్రాంతీయ విద్వేషాలు, శత్రువులతో యుద్ధ సూచనలున్నాయి. ఈ విధమైన కారణాల వలన నిత్యావసర ధరలు పెరుగుతాయి, అభద్రతా భావం పెరుగుతుంది. తీవ్ర ఆర్ధిక మాంద్యం ఏర్పడి ప్రభుత్వాలు, ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు సుస్పష్టంగా గోచారిస్తున్నాయి.             

కరోనా వైరస్ అనేది ఇప్పుడుడప్పుడే అంతం కాదు.... ముందు ముందు ఇంకా విజృంభిస్తుంది. దీంతోనే వేగలేక పోతున్నాం అంటే ముందు ముందు ఇంకో కొత్త వైరస్ రాబోతుంది. రాబోయే కాలం వర్ష కాలం ఈ వైరసులను తట్టుకోవడం కష్ట తరం అవుతుంది. ముఖ్యంగా దీనికి విరుగుడు బయట తిరగక పోవడమే, భౌతిక దూరం పాటించడమే , శుచి శుభ్రతలను పాటించడం, మాస్కులు తప్పకుండా ధరించడం.

పాటించాల్సిన సూచనలు :- 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన సూచనలను పాటించండి.

* ఆకస్మికంగా ప్రమాదం - విస్ఫోటనాలు , భూకంపాలు, మత ఘర్షణలు ,తీవ్రవాదుల వలన ఇబ్బందులు దేశానికి, ప్రపంచానికి గోచరిస్తున్నాయి.

* మన భారతీయ సాంప్రదాయం వంట పదార్థాలనే తినండి.

* చైనా ప్రోడక్ట్స్ నూడిల్స్ , అజినమోటో, బేకరీ ఐటమ్స్ మొదలైన ఏ ఆహారా పదార్థాలను తినకండి. అవి మన ఆరోగ్యాలకు ఎంతో ప్రమాదాన్ని కలిగిస్తాయి. మైదా పిండితో తయారైన ఏ ఆహార పదార్థాలు తినకండి,

* ఈ సంవత్సరం చాలా వింతలు , విడ్డురాలతో ఎన్నో వార్తలను వింటాం, అందుకే ఈ సంవత్సరం ఎక్కువ శాతం చీకటి సంవత్సరం అని నేను చెప్పుకొచ్చాను, ఆత్మ స్థైర్యమే మన ప్రధాన ఆయుధం.

* డబ్బులు పొదుపు చేసుకోండి, దుబారా ఖర్చులు చేయవద్దు, ముందు ముందు ఆర్ధిక మాంద్యం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. నిలువ డబ్బును ఎప్పుడు ఇంట్లో పెట్టుకొండి.

* భావోద్వేగాలకు గురికాకుండా ఉండాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకున్నవారు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు, ఉంటారు.

* రోజు యోగా ,ధ్యానం, వాకింగ్ చేయండి. మన సనాతన ధర్మం సూచించిన పద్ధతులను పాటించండి,

*  కరోనాముప్పు త్వరలో ముగియదు , దీనికి విరుగుడు మందు తయారు కావడానికి చాలా టైం పడుతుంది. స్వీయ రక్షణయే ప్రస్తుత మందు. వదంతులను, మూడ నమ్మకాలను నమ్మవద్దు.
 
* బయటకు వెళ్ళినప్పుడు నగలు, చేతి ఉంగరాలు, బ్రాస్ లెట్స్, బెల్ట్, వాచ్ లు  ధరించవద్దు. 

* ఇంటికి వచ్చిన తర్వాత చెప్పులను, బూట్లను ఇంట్లోకి తీసుకునివెళ్ళవద్దు, వాటిని బయట వదిలివేయండి. బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్ తరచూ వినియోగించండి.

* దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి, అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని మీకు అనిపించినప్పుడు డెటాల్ వేసుకుని తల స్నానం చేయండి. 
           
* కనీసం రెండు సంవత్సరాల వరకు విదేశాలకు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిది.

* ఒక సంవత్సర కాలం పాటు బయట ఆహారం పదార్ధాలు తినవద్దు, ఇంటి వంటనే శ్రేయస్కరం. శాఖాహార ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు.
  
* అవసరం లేని పార్టీలు, సమావేశాలు, విందులు, వినోదాలు వద్దు. యాత్రలు, కాలక్షేప ప్రయాణాలు చేయక పోవడం ఉత్తమోత్తమం.  
కనీసం ఒక సంవత్సర కాలమైన స్వీయ నియంత్రణ అవలంభిస్తూ, ప్రభుత్వమిచ్చే సూచనలను పాటిస్తూ సంక్షోభం నుండి బయట పడాలి. 

* ఈ ప్రకృతిలో మనతో పాటుగా పశు, పక్ష్యాదులు కూడా ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి, మన విశ్వ కుటుంబంలో మనతో పాటు జీవిస్తున్న మూగ జీవులకు త్రాగడానికి నీళ్ళను, తినడానికి ఆహారాన్ని మీ శక్తి సామర్ధ్యాలను బట్టి దయచేసి అందివ్వండి. విరివిగా దానం చేయండి కానీ అపాత్రదానం కానివ్వకండి.

నేను ఎవ్వరిని భయపెట్టడం లేదు, భయపెట్టాలనే ఉద్ద్యేశ్యం అంతకన్నకాదు, ఈ సంవత్సరం గోచార గ్రహ స్థితులను దృష్టిలో పెట్టుకుని గురువుల ఆశీస్సులతో నాకున్న పరిజ్ఞానంతో ఈ అంశాలను తెలియజేస్తున్నాను. దేశం సుభిక్షంగా ఉండాలని భూమిపై ఉన్న ప్రతి ప్రాణి ఆకలితో అలమటించక అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను లోకా సమస్తాసుఖినోభవంతు.