బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ గత కొంత కాలంగా వరుస పజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ఈ సీనియర్ హీరో ప్రయోగాత్మకమైన మరగుజ్జు పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు జీరో సినిమాపై పాజిటివ్ టాక్ ఆయితే ఉంది. 

కానీ ట్రైలర్ లో తమ మతాన్ని కించపరిచేలా ఒక సీన్ ఉందని సిక్కు మతానికి చెందిన ఓ లాయర్ కోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు చిత్ర యూనిట్ వివరణ కూడా ఇచ్చింది. సిక్కులు కిర్పన్‌ ను ధరించి ఉన్నట్లు షారుక్ కనిపించడంతో అమృత్ పాల్ సింగ్ అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. అయితే అందరూ అనుకున్నట్టు అది ఏ మతానికి చెందినది కాదని ఒక అలంకారణ మాత్రమే అన్నట్లు చిత్ర యూనిట్ సమాధానం చెప్పింది. 

పెళ్లి సమయంలో షారుక్ వేసుకున్న కాస్ట్యూమ్ ఆ విధంగా ఉందని కిర్పన్ కాదని అవసరమైతే సినిమాలో గ్రాఫిక్స్ ద్వారా అందుకు సంబందించిన అలంకారణను కూడా ఎడిట్ చేస్తామని కోర్టుకు వివరణ ఇవ్వడంతో దాదాపు ఈ సమస్య క్లియర్ అయినట్లే అని తెలుస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షారుక్ ఖాన్ సొంత ప్రొడక్షన్ నిర్మించారు. ఇక షారుక్ సరసన అనుష్క శర్మ - కత్రినా కైఫ్ కథానాయకులుగా నటించారు. ఇక డిసెంబర్ 21న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.