ఆర్యన్ రాజేష్, శశాంక్ వీళ్లిద్దరూ కొద్ది సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకున్న తెలుగు హీరోలు. అయితే ఇద్దరికీ అదృష్టం పెద్దగా లేదు. కొద్ది సినిమాలతోనే..అతి కొద్ది కాలంలోనే ఫేడవుట్ అయ్యారు. అయితే నటుడుగా కొనసాగిన  అతి కొద్ది సమయంలోనే తమదైన ముద్ర వేసారు. 

అయితే వీళ్లీద్దరూ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే  ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శశాంక్ అడపా..దడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. 

వీళ్దిద్దరూ కలిసి  త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌తోనూ అలరించేందుకు రెడీ అవుతున్నారు. జీ5 సంస్థ రూపొందించిన ఎక్కడికి ఈ పరుగు టైటిల్ తో రూపొందుతున్న  వెబ్‌ సిరీస్‌లో ఆర్యన్‌ రాజేష్‌,శశాంక్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 8 నుంచి ప్రసారం కానున్న ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. 

ఇక ఈ  వెబ్ సీరిస్ కోసం అన్నపూర్ణ ఫిలిం అండ్‌ మీడియా స్కూల్‌ విద్యార్థులు కూడా పనిచేయటంతో కింగ్‌ నాగార్జున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ తిరిగి తమను లైమ్ లైట్ లోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు.