Asianet News TeluguAsianet News Telugu

మహాశివరాత్రి `జీతెలుగు` స్పెషల్‌ ఈవెంట్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌ డోస్‌..

`మహారుద్రం…మహాశివం' అనే కార్యక్రమంతో మార్చ్ 11 నాడు రాత్రి 10 : 30 నిమిషములకు, మార్చ్ 12 వ నాడు ఉదయం 7 : 30 నిమిషములకు మన అందరిని భక్తి మార్గంలో తీసుకవేళ్ళనుంది జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డి. 

zee telugu maha shivarathri special events full entertainment  arj
Author
Hyderabad, First Published Mar 9, 2021, 11:46 AM IST

సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. మరి అంతటి పర్వదినాన మనముందుకు 'శివతత్వం' తోటి రాబోతున్నారు మంతెన సత్యనారాయణ రాజు ఉదయం 8 :30 నిమిషములకు ' ఆరోగ్యమే మహాయోగం' లో మాట్లాడబోతున్నారు. 

``మహారుద్రం…మహాశివం' అనే కార్యక్రమంతో మార్చ్ 11 నాడు రాత్రి 10 : 30 నిమిషములకు, మార్చ్ 12 వ నాడు ఉదయం 7 : 30 నిమిషములకు మన అందరిని భక్తి మార్గంలో తీసుకవేళ్ళనుంది జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డి. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు, తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివునికి భోళాశంకరుడని పేరు. అసలు శివరాత్రి ప్రతేక్యత ఏంటి? ఉపవాసం ఎందుకు ఉండాలి? జాగరణ ఎందుకు చేయాలి? అనే అంశాల మీద మంతెన సత్యనారాయణ రాజు మన అందరితోటి పంచుకోబోతున్నారు ఉదయం 8 :30 నిమిషములకు. 

మార్చ్ 11 నాడు రాత్రి 10 : 30 నిమిషములకు మహారుద్రాభిషేకంతో పాటుగా సింగర్ సాకేత్ మరియు 13 వ `స రి గ మ ప` సీజన్ కంటెస్టెంట్స్ అందరు కూడా 'శివ తాండవ స్తోత్రం' మరియు 'బిల్వాష్టకం' ఆలపించి ఆ పరమేశ్వరుడికి నీరాజనాలు అర్పించనున్నారు. అలాగే ఇందులో మన అందరికి ఎంతో ఇష్టమైన జంట, కొత్తగా ఒక్కటైన దంపతులు అనూష హెగ్డే, ప్రతాప్ పాల్గొంటారు. 

మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ట చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్ఠం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్ఠతను అర్థంచేసుకోవచ్చు. ఇపుడున్న కరోనా సమయంలో ఆ వివాహం ఎలా జరిపించడం? ఎలా చూడడం? అందుకే మన జీ తెలుగు 'ఉమా మహేశ్వర కళ్యాణం' తో మన ముందుకు వస్తుంది మార్చ్ 12 నాడు ఉదయం 7 : 30 నిమిషాలకు. అలాగే ఈ కళ్యాణం గొప్పతనం గురించి వివరించడానికి వస్తునారు మన ఆప్తులైన దేవిశ్రీ గురూజీ, వక్కతం చంద్రమౌళి గారు.

మరి అంతటి భక్తి, ముక్తి మార్గాన్ని మన ముందుకు తీసుకువస్తుంది జీ తెలుగు మార్చ్ 11, 12 వ తేదీలలో. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి` అని జీ తెలుగు నిర్వహకులు తెలిపారు. 

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. 

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు. సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. 

Follow Us:
Download App:
  • android
  • ios