సెట్స్ పైకి వెళ్లకుండానే పవన్, సురేందర్ రెడ్డి చిత్రానికి కళ్ళు చెదిరే డీల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు అంగీకరిస్తూనే రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ పవన్ ఒకేసారి ఇన్ని చిత్రాలకు సైన్ చేయలేదు.

Zee Network involving in Pawan Kalyan, Surender Reddy movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు అంగీకరిస్తూనే రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ పవన్ ఒకేసారి ఇన్ని చిత్రాలకు సైన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న చిత్రాలు.. త్వరలో ప్రారంభం కాబోయే చిత్రాలు ఒకసారి పరిశీలిద్దాం. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం కు రీమేక్ గా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 

అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతోంది. భీమ్లా నాయక్ కోసం ఈ చిత్ర షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చారు. తిరిగి ఈ మూవీ జనవరిలో  షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పవన్  హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. గబ్బర్ సింగ్ కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

ఈ  ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యాక పవన్ కళ్యాణ్..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. సెట్స్ పైకి వెళ్లకుండానే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మొదలైంది. తాజా సమాచారం మేరకు పవన్, సురేందర్ రెడ్డి చిత్రంలోకి ప్రముఖ జీ నెట్వర్క్ సంస్థ ఇన్వాల్వ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం జీ సంస్థ రామ్ తాళ్లూరితో కళ్ళు చెదిరే డీల్ కుదుర్చుకున్నట్లు టాక్. ఈ డీల్ ప్రకారం పవన్, సురేందర్ రెడ్డి చిత్ర శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ జీ చేతుల్లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అసలు సెట్స్  వెళ్లని చిత్రానికి అప్పుడే బిజినెస్ డీల్స్ ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా.. అనసూయ అందాల విస్ఫోటనం, లెగ్స్ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios