ఈ దునియా రకరకాల మనుషులది. ఒక్కోరు ఒక్కోరకంగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా సెలెబ్రిటీలపై తమకు తోచినట్లుగా ఏమాత్రం వెనకా ముందు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తుండడం కామన్ అయిపొయింది. చాలా వరకు సెలబ్రెటీలు ఈ విషయాల్ని పట్టించుకోరు. కొందరు మాత్రం సీరియస్ గా తీసుకొని రివర్స్ కౌంటర్లు ఇస్తుంటారు మరికొందరు మళ్లీ సోషల్ మీడియాలోకి రాకూడదని తమ ఎకౌంట్లు ఎత్తేస్తారు.

 

సెలెబ్రిటీలపై ట్రోలింగ్, ఎకౌంట్స్ బ్లాకింగ్ ఇదంతా నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతుండేవే. కానీ రీసెంట్ గా జరిగిన ఓ ఘటన సెలెబ్రిటీలను ట్రోలింగ్ చేసే వారికి షాక్ లాంటిది. తనపై కామెంట్ చేసిన ఒక నెటిజన్ ను బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ గట్టిగా తిట్టేసింది.  ఓ ప్రముఖ ఛానెల్ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ పై  ‘ట్రోల్ పోలీస్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిని పిలిపించి ఆ సెలబ్రెటీలతో మాట్లాడిస్తారు. రీసెంట్ గా బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఆ షోకి వచ్చింది. తనపై నెగిటివ్ కామెంట్ చేసిన వ్యక్తిని చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. ఇష్టం ఉన్నట్లు తిట్టేసింది. నా చెయ్యి చాలా పెద్దది. కొడితే మొత్తం పళ్ళన్నీ రాలిపోతాయ్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. అంతే కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది కూడా. ఇక అందుకు సంబందించిన వీడియోను జరీన్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ మరో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.