బాలీవుడ్ లో హెట్ స్టోరీ - వీర్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ జరీన్ ఖాన్. ఈ బ్యూటీ సినిమాలతో స్టార్ డమ్ ఏ రేంజ్ లో సంపాదించుకుందో గాని వరుసగా కాంట్రవర్సీ న్యూస్ లతో మాత్రం తెలియని వారికి కూడా పరిచయమవుతోంది. 

పబ్లిక్ లో ఒక వ్యక్తి చెంప చెల్లుమనిపించడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. ఔరంగ బౌద్ లో రీసెంట్ గా ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్ లాంచ్ సందర్బంగా జరీన్ ప్రత్యేక అతిధిగా హాజరైంది. 

అయితే ఆమెను చూసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక ఒక వ్యక్తి జరీన్ దగ్గరకు వెళ్లడంతో అందరూ చూస్తుండగానే పబ్లిక్ లో గట్టిగా చెంప పగలగొట్టింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జరీన్ ఆగ్రహానికి పలువురు బయపడి వెనుకడుగు వేశారు. ఇక పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి ఆమెను కారెక్కించి పంపించారు. అయితే ఆ వ్యక్తి తనను అసభ్యంగా టచ్ చేశాడని అందుకే కొట్టానని జరీన్ వివరణ ఇచ్చింది.

గతంలోనే పలు వివాదాలతో జరీనా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే మొన్న అమ్మడి కారు ఒక బైక్ ను ఢీకొట్టగా వ్యక్తి మరణించడంతో కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఆ వివాదం ఓ కొలిక్కి రాకముందే జరీన్ కొత్త వివాదంతో అందరికి షాక్ ఇచ్చింది.