డిప్రెషన్ తో చనిపోవాలనుకున్న : దంగల్ ఫేం జైరా వసీం

First Published 12, May 2018, 9:14 AM IST
Zaira wasim opens up about depression
Highlights

డిప్రెషన్ తో చనిపోవాలనుకున్న

దంగల్ ఫేం డిప్రెషన్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఈ బాలీవుడ్ నటి వెల్లడించింది. డిప్రెషన్ వల్ల ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని దంగల్ ఫేం జైరా వసీం....తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం జైరా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

డిప్రెషన్ కు వయసుతో పనిలేదని జైరా తెలిపింది. చిన్నపిల్లవైన నీకు డిప్రెషన్ ఏమిటని చాలా మంది అన్నారని ఆ సమస్య ఉందని తనకు తెలీదని చెప్పింది. రాత్రుళ్లు హఠాత్తుగా మెలకువ వచ్చేదని నిద్రపట్టక ఏడుపొచ్చేదని తెలిపింది. కోపం అసహనంతో అధికంగా తిని లావెక్కానని చెప్పింది. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపింది. తానే కరెక్టని అమ్మానాన్నలు డాక్టర్లు చెప్పేవి పనికిమాలిన విషయాలని అనిపించేదని తెలిపింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో కూడా డిప్రెషన్ బారిన పడే అవకాశముందని తెలిపింది. తాను 12 ఏళ్ల వయసులో డిప్రెషన్ కు గురయ్యానని నాలుగేళ్ల చికిత్స తర్వాత కోలుకున్నానని చెప్పింది.  ఆ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పడం తక్కువేనని జైరా తెలిపింది. 

loader