మీ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం..: బాలకృష్ణకు బర్త్ డే విషెస్ చెప్పిన యువరాజ్..
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి క్యాన్సర్ బాధితులకు సాయం అందిస్తున్న బాలకృష్ణ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
‘‘హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్. అనేక ఇతర కార్యక్రమాలతోపాటు.. మీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజంలో సానుకూల ప్రభావం చూపాలనే మీ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సంవత్సరం మీకు గొప్పగా ఉండాలి’’ అని యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బాలకృష్ణతో గతంలో దిగిన ఫొటోను కూడా యువీ షేర్ చేశారు. ఇక, గతంలో కూడా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఇక, యువరాజ్ సింగ్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక, బాలకృష్ణ ఓవైపు సినీ పరిశ్రమలో.. మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్‌బారినపడిన వారికి సాయం అందిస్తున్నారు.