వైజాగ్ లో సందడి చేసిన నాగచైతన్య, లావణ్య త్రిపాఠి వైజాగ్ కాలేజ్ లో "యుద్ధం శరణం" సినిమా ప్రమోషన్ మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధమైన "యుద్ధం శరణం"
వైజాగ్ లో చైతు, లావణ్య సందడి చేశారు. అక్కినేని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి ఇరువురు కలిసి "యుద్ధం శరణం" లోనటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 8న విడుదలకు సిద్దమైంది. సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. విడుదలకు మరో మూడు రోజులే ఉండటంతో టీం సభ్యులు కూడా ప్రచారం ఉదృతం చేశారు. ఇప్పటికే పలు టీవి ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. మంగళవారం నాడు చైతు, లావణ్య వైజాగ్‌లో సందడి చేశారు.
టీం అంతా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా యుద్ధం శరణం టూర్ పేరుతో ముఖ్యమైన ప్రాంతాలకు తిరిగి సినిమాను ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలోని చైతన్య కళాశాలలో విద్యార్థులను కలిశారు. కాసేపు వాళ్లతో ముచ్చటించారు. అనంతరం చైతు, త్రిపాఠితో సెల్పీలు దిగడానికి విద్యార్థులు పోటీ పడ్డారు.
ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రత్యేమైన పాత్రను పోషిస్తున్నాడు. సీనియర్ నటి రేవతి, రావురమేష్ తదితరులు నటిస్తున్నారు. యుద్ధం శరణం సినిమాను కృష్ణ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన తెలుగు మొట్టమొదటి సినిమా. గతంలో తమిళ్ లో విజయ్ నటించిన తలైవా, విక్రమ్ నటించిన తండావం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి...
