టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఫైనల్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడానికి సిద్ధమయ్యారు అని చెప్పవచ్చు. ఎందుకంటే దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జనరల్ ఎలక్షన్స్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. 

పూరి జగన్నాథ్ సొంత ప్రాంతం నర్సీపట్నం అసెంబ్లీ స్థానం టికెట్టును జగన్ పూరి సోదరుడికి ప్రకటించారు. దీంతో పూరి ఫ్యామిలీ ఓటు మొత్తం వైసీపీకె అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గతంలోనే ఆ నియోజకవర్గం టికెట్టును ఉమా శంకర్ కి ఇచ్చినప్పటికీ తెలుగు దేశం పార్టీ ప్రత్యర్థి అయ్యన్న పాత్రుడు చేతిలో ఓడిపోయారు. 

అయినప్పటికీ వైసిపి పార్టీలో కొనసాగుతూ నర్సీపట్నం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఉమాశంకర్ ని నమ్మి జగన్ మరోసారి టికెట్టు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.  

పసివయసులో బాక్స్ ఆఫీస్ హీరోలు.. చిన్నపుడు ఎంత ముద్దుగా ఉన్నారో

2000 - 2019: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ by year