ఇప్పుడు ఎక్కడ విన్నా వకీల్ సాబ్ కబుర్లే. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా 'వకీల్ సాబ్' కావటంతో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ మూవీ నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'పింక్‌'కు రీమేక్‌గా వచ్చిన 'వకీల్ సాబ్'కు మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మీడియా మొత్తం పాజిటివ్ రివ్యూలతో మోత మ్రోగించేసింది. మరో ప్రక్క సెలబ్రెటీలు..ఒక్కొక్కరే ఈ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు ఈ చిత్రాన్ని చూసి తన స్పందనను ట్విట్టర్  ద్వారా తెలియజేసారు.

‘నా అభిమాన నటుడు నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని చూసాను. సినిమా చాలా బాగుంది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఇక ఈ సినిమా పోలీస్ లు ఎలా తప్పుడు కేసులు ఫైల్ చేస్తారు..అలాంటి తప్పుడు కేసులపై న్యాయం కోసం ఎలా ఫైట్ చేస్తారనే విషయంతో నడుస్తుంది. నేనూ స్టేట్ గవర్నమెంట్ తో,పోలీస్ లతో  అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాను. నా వకీల్ సాబ్ లు కూడా పవన్ కళ్యాణ్ లాగ వాదించి తప్పుడు కేసుల నుంచి నన్ను బయిట పడేస్తారనుకుంటున్నాను’ అన్నారు.

బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ.. తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా మార్పులు చేయడమే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ నుండి ఏమేమి కోరుకుంటున్నారు అన్ని సమకూర్చి ఫ్యాన్స్ కు పండుగ చేసారు. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరుపుకుంటోంది.  

 ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి షో నుంచే  పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్‌.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.38 నుంచి రూ.40 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.