ఎన్నికల హడావిడి ముగిసింది. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఎన్నికల సమయంలో బిజీగా గడపడం వల్ల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తర్వాత బాలయ్య మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. ప్రస్తుతం బాలయ్య 105వ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో జైసింహ చిత్రం విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ కథ కుదరకపోవడంతో ఆలస్యమైందని వార్తలు వస్తున్నాయి. ముందుగా రాజకీయ అంశాలతో ఓ కథని సిద్ధం చేసుకున్నారట. ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి ఉంటే ఆ కథ ఫైనల్ అయ్యేదని టాక్. అందులో వైఎస్ జగన్ పాత్రని పరోక్షంగా చూపించాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ ఎన్నికల్లో వైసిపి ఘనవిజయం సాధించడంతో ఆ కథని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇది టాలీవుడ్ లో జరుగుతున్న ఓ ప్రచారం మాత్రమే. వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం పరుచూరి మురళి అందించిన కొత్త కథతో బాలయ్య చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలయ్య కోసం బోయపాటి, వివి వినాయక్ లాంటి దర్శకులు ఎదురుచూస్తున్నారు.