బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్, మెహ్రీన్ లు హీరోయిన్లుగా 'కవచం' చిత్రాన్ని తెరకెక్కించారు. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాగాలేదని తేల్చేశారు జనాలు. హిట్ అవుతుందనుకున్న సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో బెల్లంకొండ డీలా పడ్డాడు.

కానీ అతడి చేతిలో రెండు సినిమాలు ఉండడంతో ఇక ఆ సినిమాలతో బిజీ అయిపోతాడు. హీరోయిన్ కాజల్ చేతిలో మూడు సినిమాల వరకు ఉన్నాయి. ఆమెకి కూడా ఈ సినిమా ఫ్లాప్ తో పెద్దగా నష్టమేమీ రాలేదు. కానీ హీరోయిన్ మెహ్రీన్ కి మాత్రం ఈ సినిమా పెద్ద దెబ్బనే చెప్పాలి.

ఇప్పటికే కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా ఇలా వరుస ఫ్లాప్ లతో ఉన్న ఈ భామ లిస్టు లోకి మరో ఫ్లాప్ సినిమా వచ్చి చేరింది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనే మెహ్రీన్ ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉందని అంటున్నారు. ఎన్ని సినిమాల్లో నటిస్తున్నా.. ఈ పంజాబీముద్దుగుమ్మకి విజయం మాత్రం వరించడం లేదు.

ప్రస్తుతానికి తన గ్లామర్ షోతో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. అమ్మడు చేతిలో 'ఎఫ్2' సినిమా ఒక్కటే ఉంది. ఇది సక్సెస్ అయితే మెహ్రీన్ కొంతకాలం ఇండస్ట్రీలో పాగా వేయొచ్చు లేదంటే మాత్రం టాలీవుడ్ లో అవకాశాలు కష్టమే!