Asianet News TeluguAsianet News Telugu

గ్రేట్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ‘హనుమాన్’ టీజర్.. సూపర్ హీరోగా అదరగొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా!

యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా నటించి చిత్రం ‘హనుమాన్’. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంతో తెరకెక్కనుంది. తాజాగా సినిమాపై అంచనాలను పెంచేలా టీజర్ ను విడుదల చేశారు. విజువల్స్, మ్యూజిక్, తదితర అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

Young hero Teja Sajjas HanuMan movie Official Teaser Released!
Author
First Published Nov 21, 2022, 2:06 PM IST

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) - అమృత అయ్యర్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హనుమాన్ (HanuMan). ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ ముగిసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న ఈచిత్రపు ప్రమోషన్ పనులను కూడా షురూ చేశారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ‘హనుమాన్’ నుంచి ప్రామీసింగ్ టీజర్ ను కొద్దిసేపటి కిత్రం లాంచ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

టీజర్ ప్రారంభంలో.. ఒక జలపాతం వెంట వెళ్తూ చేతిలో గదను పట్టుకొని నిలబడి ఉన్న భారీ హనుమాన్ విగ్రహాన్ని అద్భుతమైన విజువల్స్ గా చూపించారు. కొండపై కొన్ని జీవులు తిరుగుతూ పరమాత్మ రాకకు సంకేతాన్ని ఇస్తుంటారు. ఆ వెంటనే సముద్రపు ఒడ్డున హీరో తేజ సజ్జా అపస్మారక స్థితిలో పడి ఉండి.. సూపర్ హీరగా ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి కరంగా ఉంది. భయంకరమైన సన్నివేశంలో అమృత అయ్యర్, కోపంగా పెళ్లి కుమార్తె గెటప్ లో శత్రువులను ఎదుర్కొంటూ వరలక్ష్మి శరత్‌కుమార్ ఎంట్రీ ఆకట్టుకుంది. అజ్ఘాతవాసిగా ఉన్న హనుమంతు సూపర్ హీరోగా ఎలా మారడన్న అంశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గ్రేట్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ విజువల్స్, స్క్రీన్ రైటింగ్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. 

శివేంద్ర కెమెరా వర్క్‌ స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేసింది. సంగీత దర్శకుడు గౌరహరి తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మతిభ్రమింపజేశాడనే చెప్పాలి. మ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయనేలా టీజర్ ద్వారా అర్థమవుతోంది. మొత్తానికి టీజర్ సినిమాపై హై అంచనాలను నెలకొల్పింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios