టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తన బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తుంటాడు. రీసెంట్ గా నితిన్ తమిళంలో సక్సెస్ అయిన 'రాక్షసన్' అనే సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. నిజానికి ఈ సినిమాను రీమేక్ చేయాలనేది మెగా క్యాంప్ నిర్మాతల ప్లాన్.

కొన్ని రోజులుగా కొందరు దర్శకులకు, రచయితలకు ఈ సినిమా చూపించి తెలుగుకి తగ్గట్లుగా కథను సిద్ధం చేయమని చెబుతున్నారట. కానీ వారు రీమేక్ హక్కులు కొనడంలో ఆలస్యం చేశారు. మెగాహీరోల్లో ఒకరితో సినిమా చేయాలని అనుకున్నారు.

ప్రస్తుతం మెగాహీరోలందరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉండడంతో ఎవరు డేట్స్ ఇస్తారో చూసి అప్పుడు రీమేక్ రైట్స్ కొనాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే నితిన్ సినిమా హక్కులను దక్కించుకున్నారు. ఆ విధంగా మెగా క్యాంప్ నిర్మాతల ప్లాన్ ని చెడగొట్టేశాడు నితిన్.

రష్యాలో చోటుచేసుకున్న కొన్ని నిజ సంఘటలన ఆధారంగా తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సీరియల్ కిల్లర్ ని వెతికి పట్టుకొనే పోలీస్ కథే ఇది. థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది.