Asianet News TeluguAsianet News Telugu

సమంత శాకుంతలంలో దుశ్యంతుడిగా యంగ్ హీరో!

శాకుంతలం మూవీలో సమంతతో జోడీ కట్టనున్న హీరోను పరిచయం చేశారు చిత్ర యూనిట్. సమంత ఆ యువ హీరోకి బర్త్ డే విషెస్ తెలియజేయడం ద్వారా... ఆయన శాకుంతలంలో నటిస్తున్న విషయంపై స్పష్టత ఇచ్చారు. మలయాళ యువ హీరో దేవ్ మోహన్ శాకుంతలంలో సమంత జోడీగా చేస్తున్నారు. 
 

young hero dev mohan board for samantha shakunthalam ksr
Author
Hyderabad, First Published Mar 7, 2021, 2:12 PM IST

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ నిర్మిస్తూ, తెరకెక్కిస్తున్నారు. గుణశేఖర్ నుండి చాలా కాలం తరువాత వస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శాకుంతలం కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. 

కాగా ఈ మూవీలో సమంతతో జోడీ కట్టనున్న హీరోను పరిచయం చేశారు చిత్ర యూనిట్. సమంత ఆ యువ హీరోకి బర్త్ డే విషెస్ తెలియజేయడం ద్వారా... ఆయన శాకుంతలంలో నటిస్తున్న విషయంపై స్పష్టత ఇచ్చారు. మలయాళ యువ హీరో దేవ్ మోహన్ శాకుంతలంలో సమంత జోడీగా చేస్తున్నారు. 

ఇక దేవ్ తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేని పేరు. దేవ్ మోహన్ చేసింది కూడా కేవలం ఒక చిత్రం మాత్రమే. సుఫీయుమ్ సుజాతయుమ్ అనే మలయాళ రొమాంటిక్ డ్రామాలో ఆయన నటించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడం జరిగింది. దేవ్ మోహన్ ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో అది కూడా సమంత లాంటి స్టార్ కి జంటగా నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. త్వరలో శాకుంతలం మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios