ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. వరుస హిట్స్ తో యూత్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ గా మారిపోయాడు. యూత్ లో అతడికున్న ఫాలోయింగ్ ని పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ తో పోలుస్తున్నారు. ఇటీవల అతడు నటించిన సినిమా 60 కోట్ల షేర్ సాధించి వంద కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. సినిమాల్లోకి రాకముందు నుండే సదరు కుర్ర హీరో ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపించాయి.

తాజాగా తన కో స్టార్ తో కూడా ఎఫైర్ ఉందనే వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ యంగ్ హీరో విదేశీ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని సమాచారం. యూరోపియన్ కి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటోంది. ఆమెతో ఈ కుర్ర హీరో చెట్టపట్టాలేసుకొని తిరగడం బయటకి రావడంతో ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి డేటింగ్ వ్యవహారాలు కామన్.. నచ్చితే తన రిలేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు లేదంటే ఎవరిదారి వారు చూసుకుంటారు. మరి ఈ జంట ఇంకెన్నాళ్లు డేటింగ్ చేస్తుందో చూడాలి!