కొందరి హీరోలకి అన్నీ తమకే తెలుసు అన్న భావన ఉంటుంది. రోజులు తరబడి ఒకే వర్క్ చేయటం వల్ల తమ మీద తమకు ఎనలేని నమ్మకం వచ్చేస్తుంది. ఇరవై నాలుగు క్రాప్ట్ లు చేసే పని ఇంతేగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా డైరక్షన్ చాలా సులభం అనిపిస్తుంది. అలా అనుభవం తెచ్చే ధైర్యం ఒక్కోసారి డైరక్టర్స్ కు సమస్యగా మారుతుంది. హీరోని ఏమీ అనలేరు. వాళ్లు మితిమీరు ఇచ్చే  సూచనలు, సలహాలు భరించలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ దర్శకుడుకి అదే పరిస్దితి ఎదురైందని ఫిల్మ్ నగర్ టాక్.

రీసెంట్ గా ఓ  పెద్ద హిట్  సినిమా తీసి పేరు తెచ్చుకున్న ఓ హీరో ..మెల్లిమెల్లిగా డైరక్షన్ డిపార్టమెంట్ లో వేలు పెట్టడం మొదలెట్టాడట. ఇప్పటివరకూ అలాంటి ట్రాక్ రికార్డ్ లేని ఆ హీరో ..నా సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ మాత్రం జాగ్రత్తలు నేను తీసుకోవాలని అనే వంకతో డైరక్టర్ ని ప్రక్కన పెట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో దూరిపోతున్నాడట. అతని బిహేవియర్ తట్టుకోలేక , బయిటకు చెప్పుకోలేక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు వెళ్లకుండా ఉండిపోయాడట సదరు దర్శకుడు. 

అప్పటికైనా నిర్మాత కలగచేసుకుని విషయం తెలుసుకుని హీరోని ప్రక్కన పెట్టి తన పని తాను చేసుకోనిస్తానడని. అయితే అటునుంచి ఎటువంటి స్పందనా లేదట.  హీరో కూడా మొహమాటం లేకుండా రోజూ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్ష్యమవుతున్నాడట. డైరక్టర్ ఫీల్ అవుతున్నాడనే విషయం తెలిసినా పట్టించుకోవటం లేదట. అక్కడితో ఆగకుండా డైరక్టర్ కు రోజు వారి వాట్సప్ లో ఈ రోజు ఇంతవరకూ పని పూర్తి చేసాం అని మెసేజ్ లు పెడుతున్నాడట. డైరక్టర్ కు ఏం చేయాలో పాలు పోక ఆ మెసేజ్ లు రిప్లై ఇవ్వటం లేదట. ఇది ఎంత దూరం వెళ్తుందో అని టీమ్ మొత్తం టెన్షన్ తో చూస్తున్నారట.