కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రపై యువ నటుడు చేతన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉపేంద్రను టార్గెట్ చేస్తూ చేతన్ విడుదల చేసిన వీడియోపై ఉపేంద్ర ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడు ఉపేంద్ర ఓ రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. కాగా కుల రాజకీయాలపై తమ పార్టీ స్టాండ్ ఏమిటో తెలియజేస్తూ ఉపేంద్ర కొన్ని వ్యాఖ్యలు చేశారు. 


ఉపేంద్ర వ్యాఖ్యలను తప్పుబడుతూ నటుడు చేతన్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ''మా సెలెబ్రిటీలలో కొందరు కుల వివక్షత గురించి చర్చించడకుండానే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.ఇది హాస్యాస్పదంగా ఉంది. ఓ జబ్బుకు ట్రీట్మెంట్ అంటే అది లేకుండా చేయడమే. కులవివక్షత సమాజానికి పట్టిన జబ్బులాంటిది. ఆ వ్యక్తి మాటల ద్వారా ఎంత గొప్పవాడో, ఎంత పరిణితి ఉందో అర్థం అవుతుంది'' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. 

ఈ వీడియోలో ఉపేంద్ర పేరు ఎక్కడా ప్రస్తావించనప్పటికీ చేతన్ విమర్శలు చేసింది ఉపేంద్రను ఉద్దేశించే. దీనితో ఉపేంద్ర ఫ్యాన్స్ చేతన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉపేంద్ర ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాడో చూడాలి. చేతన్ కన్నడ పరిశ్రమలో చాలా చిత్రాలలో నటించారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సామాజిక స్పృహ కలిగిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు.