టాలీవుడ్ యంగ్ హీరో ఈ ఏడాది ఆరంభంలో హిట్ అందుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. వెంటనే మరో ఫ్లాప్ తో డీలా పడ్డాడు. ఈ రెండు సినిమాలను తన బ్యానర్ పైనే నిర్మించిన హిట్ తో వచ్చిన డబ్బుని ఫ్లాప్ సినిమాకు కవర్ చేశాడు.

ఇది ఇలా ఉండగా.. ఈ హీరో గతంలో ఓ హీరోయిన్ పై మండిపడ్డాడు. టాలీవుడ్ లో తన నటనతో యూత్ ని 'ఫిదా' చేసిన ఓ బ్యూటీపై ఈ కుర్ర హీరో బహిరంగంగానే నెగెటివ్ కామెంట్స్ చేశాడు. అయినప్పటికీ ఆమె పెద్దగా రియాక్ట్ అవ్వలేదు.

కానీ ఆ హీరోకి మాత్రం ఆమెపై కోపం అలానే ఉండిపోయిందట. రీసెంట్ గా ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ హీరో తెగ సంతోషపడుతున్నాడట. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 'పడిపోవడం'తో ఈ కుర్ర హీరో సదరు హీరోయిన్ ఫ్లాప్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడట.