ప్రభాస్ వారిని ఇబ్బంది పెడుతున్నాడా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 8, Sep 2018, 12:28 PM IST
young directors feeling the pressure
Highlights

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ బాగా పెరిగింది. నేషనల్ వైడ్ గా గుర్తింపు పెరగడంతో అతడి సినిమాలను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. 

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ బాగా పెరిగింది. నేషనల్ వైడ్ గా గుర్తింపు పెరగడంతో అతడి సినిమాలను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. దీంతో ప్రతి సినిమా కూడా భారీ స్కేల్ లో ఉండాలని భావిస్తున్నారు. భారీ కాన్సెప్టులు, భారీ బడ్జెట్ సినిమాల్లో నటించాలని ప్రభాస్ కూడా నిర్ణయించుకున్నాడని టాక్.

నిజానికి ఆ విధంగా చేస్తేనే అతడికి వచ్చిన క్రేజ్ ని కాపాడుకోగలరు. దీంతో అతడితో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులకు ఒత్తిడి పెరిగిపోతుంది. నిజానికి ప్రభాస్ తో 'సాహో' సినిమాను చేస్తోన్న దర్శకుడు సుజీత్ మొదట కమర్షియల్ సినిమా చేయాలనుకున్నారు. కానీ యువి క్రియేషన్స్ వారు అతడిని ప్రోత్సహించి 150 కోట్ల బడ్జెట్ సినిమాను అతడి చేతిలో పెట్టారు.

ప్రభాస్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ పరిస్థితి కూడా అంతే. అతడు కూడా ప్రభాస్ తో కమర్షియల్ సినిమా చేయాలనుకుంటే ఇప్పుడు భారీ స్కేల్ లో సినిమా చేయమంటున్నారు. నిజానికి ఇది వారి కెరీర్ కి మంచి ఆఫర్ అయినప్పటికీ అనుభవం పరంగా చూసుకుంటే ఇంత పెద్ద సినిమాలను వారు ఎలా క్యారీ చేస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. వారి అనుభవలోపం కారణంగా సినిమాకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితో అన్ని కోట్లకు బాధ్యత ఎవరు వహిస్తారో నిర్మాతలకే తెలియాలి! 

loader