అఖిల్ గ్రౌండ్ లో బౌండరీలు కొడుతుంటే ఒక యంగ్ బ్యూటీ ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేసింది. అఖిల్ కొట్టిన ఫోర్లు, సిక్సులను ఆస్వాదించింది. ఆమె ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది.
అఖిల్ గ్రౌండ్ లో బీభత్సం చేస్తుండగా నటి ప్రణవి మానుకొండ తెగ ఎంజాయ్ చేశారు. ఆయన బౌండరీలు బాదుతుంటే ఎగిరి గంతులు వేశారు. తెలుగు వారియర్స్ కి సప్పోర్ట్ గా ప్రణవి నినాదాలు చేస్తుంటే అందరూ ఆమెనే చూస్తుండి పోయారు. ఇక సీసీఎల్ మ్యాచ్లు ఆద్యంతం ఆస్వాదిస్తునట్లు చెబుతూ ప్రణవి మానుకొండ ఒక వీడియో షేర్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన సదరు వీడియో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఎవరీ ప్రణవి మానుకొండ అని నెటిజెన్స్ సెర్చ్ చేస్తున్నారు.
ప్రణవి మానుకొండ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగు పెట్టారు. ఉయ్యాలా జంపాలా చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. సూర్యవంశం, గంగ మంగ వంటి పాప్యులర్ సీరియల్స్ లో నటించారు. స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీలో హీరోయిన్ గా నటించారు. హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక అఖిల్ ప్రొఫెషనల్ క్రికెటర్. సీసీఎల్ మ్యాచ్లలో తెలుగు వారియర్స్ తరపున అల్లాడిస్తున్నారు. పరుగుల వరద పారిస్తున్నాడు. అఖిల్ క్రికెటర్ కావాలని కోరుకున్నారు. బాల్యం నుండి క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు. అఖిల్ ఆస్ట్రేలియా అకాడమీలలో ట్రైన్ కావడం విశేషం. అయితే ఫ్యామిలీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన హీరో అయ్యాడు. పలు సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ లో అఖిల్ క్రికెటర్ గా సత్తా చాటారు.
అఖిల్ తుఫాను ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్... మీరు క్రికెటర్ అయ్యుంటే ఇండియన్ టీం లో స్టార్ బ్యాట్స్ మెన్ గా దుమ్ముదులిపేవారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా నెక్స్ట్ అఖిల్ ఏజెంట్ టైటిల్ తో యాక్షన్ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల తేదీ ప్రకటిస్తూ ప్రోమో విడుదల చేశారు. అఖిల్ నెవర్ బిఫోర్ అవతార్ షాక్ ఇచ్చింది. ఏజెంట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నేపథ్యంలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ యూత్ ని ఆకట్టుకుంది. ఈ విజయాల పరంపర కొనసాగించాలని అఖిల్ కోరుకుంటున్నారు. ఇక ఏజెంట్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది.
