Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్ సెట్స్ లో దబంగ్ 3 నటి ఆత్మహత్య 


షూటింగ్స్ సెట్స్ లో నటి ఆత్మహత్యకు చేసుకోవడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువ నటి మరణం కలచివేసింది. 

young actress tunisha sharma commits suicide in shooting sets
Author
First Published Dec 24, 2022, 8:00 PM IST


యువనటి తునీషా   శర్మ షూటింగ్ సెట్స్ లో ఆత్మహత్మ చేసుకున్నారు. 20 ఏళ్ల తునీషా శర్మ ముంబైలో నేడు ఎవరూ చూడకుండా గదిలో ఉరి వేసుకున్నారు. కాసేపటి తర్వాత తునీషా శర్మను చూసిన యూనిట్ సభ్యులు హుటాహుటిన దగ్గర్లోనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తునీషా శర్మ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. 

చాలా చిన్న ప్రాయంలో నటిగా తునీషా శర్మ కెరీర్ ప్రారంభించారు. భారత్ కా వీర్ పుత్ర-మహారాణా ప్రతాప్ సీరియల్ తో ఆమె అరంగేట్రం చేశారు. అలాగే చక్రవర్తిన్ అశోక సామ్రాట్ అనే సీరియల్ లో నటించారు.  గబ్బర్ పూంచ్వాలా, షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్, ఇంటర్నెట్ వాలా లవ్, ఇష్క్ సుభాన్ అల్లా వంటి పలు సీరియల్స్ లో తునీషా సింగ్ నటించారు. 

తునీషా సింగ్ కొన్ని బాలీవుడ్ చిత్రాలలో క్యామియో, చిన్న చిన్న పాత్రలు చేశారు.  ఫితూర్ ఆమె మొదటి చిత్రం. అలాగే  బార్ బార్ దేఖో, దబంగ్ 3 తో పాటు కొన్ని చిత్రాలలో ఆమె కనిపించారు.బార్ బార్ దేఖో మూవీలో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్ర చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటి ఆత్మహత్య బాలీవుడ్ లో విషాద ఛాయలు నింపింది. తునీషా మంచి నటి, ఆమె ఇలా చేయడం నమ్మలేకపోతున్నామని సహనటులు, సన్నిహితులు వాపోతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios