యువ నటుడు సత్యదేవ్ తన ప్రతి చిత్రంతో నటనలో మెప్పిస్తున్నాడు. సత్యదేవ్ నటించిన అంతరిక్షం, ఇస్మార్ట్ శంకర్, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాల్లో అతడి నటనని చూడొచ్చు. దీనితో సత్యదేవ్ ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా సత్యదేవ్ రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

సత్యదేవ్ నటనకు మెచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సత్యదేవ్ ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తున్నాడు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. స్వాతంత్ర సమర నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా సత్యదేవ్ సూపర్ స్టార్ మహేష్ చిత్రం సరిలేరు నీకెవ్వరులో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ చిత్రంలో సత్యదేవ్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్ లో జరిగిన షూటింగ్ లో కూడా సత్యదేవ్ పాల్గొన్నాడు.